టాప్ 10 ఓపెనింగ్స్‌లో సైరా ఐదో స్థానం

సౌత్ లో టాప్ 10 గ్రాసర్స్ ఏవి? అంటే ఇదిగో ఇదే స‌మాధానం. తాజాగా మెగాస్టార్ న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` 81కోట్ల డే వ‌న్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించ‌డంతో ఆ ప్లేస్ మెంట్ కాస్తా మారింది. ఏ పొజిష‌న్ లో ఎవ‌రికి ఎక్క‌డ ఎంత చోటు ద‌క్కింది? అన్న‌ది చూస్తే..
బాహుబ‌లి 2 చిత్రం 215కోట్ల గ్రాస్ తో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఆ స్థానానికి ఇప్ప‌ట్లో వ‌చ్చిన డోఖా ఏం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత సాహో-127కోట్లు, 2.0 చిత్రం-95కోట్లు, క‌బాలి-88కోట్ల వ‌సూళ్ల‌తో టాప్ 4లో నిలిచాయి. 82కోట్ల ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్ల‌తో సైరా చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. బాహుబ‌లి-73కోట్లు, స‌ర్కార్ -67కోట్లు, అజ్ఞాత‌వాసి-61కోట్లు, అర‌వింద స‌మేత‌-58కోట్లు, భ‌ర‌త్ అనే నేను-55కోట్ల‌తో ప‌దో స్థానంలో నిలిచింది.