సైరా కు 2.ఓ లాంటి ప్రాబ్ల‌మ్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సైరా న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ విష‌యంలో మ‌రోసారి నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయా? 2.ఓ ఎదుర్కొన్న స‌మ‌స్య‌లే సైరాకు ఎదురయ్యే అవ‌కాశం ఉందా? అందుకే సైరా టీమ్ మౌనం వ‌హిస్తుందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. సైరా ని ఈ ద‌స‌రాకు రిలీజ్ చేస్తామ‌ని చిత్ర నిర్మాత రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ ప్ర‌మోష‌న్ టైమ్ లో వెల్ల‌డించారు. 250 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నామ‌ని, బ‌డ్జెట్ పెంచ‌డానికే చూస్తాం త‌ప్ప‌! త‌గ్గే ఛాన్స్ లేద‌ని చ‌ర‌ణ్ బాహాటంగా తెలిపారు. నిర్మాణ విష‌యాలు ప‌క్క‌బెడితే సినిమా రిలీజ్ ఈ ఏడాది ఉండే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ ప‌నులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఉన్న టైమ్ స‌రిపోయేలా లేద‌ని స‌మాచారం. `2.ఓ` త‌ర‌హా ప్రోబ్ల‌మ్ త‌లెత్తితే ఇబ్బందుల త‌ప్ప‌వ‌ని చ‌ర‌ణ్ సినిమా వాయిదా వేసే ఆలోచ‌న‌లో ఉన్నాడుట‌.

శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హించిన `2.ఓ` విఎఫ్ ఎక్స్ ప‌నుల్లో ఎలాంటి జాప్యం జ‌రిగిందో తెలిసిందే. శంక‌ర్ పెట్టిన డెడ్ లైన్ కు హాంకాంగ్ కంపెనీ ప‌ని పూర్తిచేయ‌క‌పోగా, కంపెనీనే దివాళా తీసేసింది. దీంతో హుటా హుటిన మ‌రొకంపెనీ ప‌ట్టుకుని గ్రాఫిక్స్ ప‌నులు పూర్తిచేయాల్సి వ‌చ్చింది. అవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే చ‌ర‌ణ్ విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ ప‌నుల‌న్నింటినీ ఒకే కంపెనీకా కాకుండా వ‌ర్క్ ని డివైడ్ చేసి ర‌ష్యాలోని వివిధ కంపెనీల‌కు అప్ప‌గించాడుట. షూటింగ్ తో పాటు ఏక‌ధాటిగా గ్రాపిక్స్ ప‌నులు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అవుట్ ఫుట్ అనుకున్న విధంగా రావ‌డం లేదుట‌. దీంతో వ‌ర్కింగ్ డేస్ పెరుగుతున్నాయ‌ట‌. అదే కంటున్యూ అయితే అనుకున్న తేదీకి రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మే. ద‌స‌రాకి ఇంకా ఐదు నెల‌లే స‌మ‌యం ఉంది. ఈ గ్యాప్ లో గ్రాఫిక్స్ ప‌నులు పూర్త‌వ్వ‌డం అసాధ్య‌మ‌నే అంటున్నారు. అందుకే చ‌ర‌ణ్ అల్ట‌ర‌నేష‌న్ రిలీజ్ డేట్ కూడా చూసుకుంటున్నాడుట‌. ఈ నేప‌థ్యంలో 2020  సంక్రాంతి లేదా? స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.