సైరా షూటింగ్ పూర్తయింది

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌చేసుకుంది. ఈ విష‌యాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న వేలు వెల్ల‌డిండించారు. సోమ‌వారంతో సైరా షూటింగ్ పూర్త‌యింది. ఎంతో శ్ర‌మించి, మాకు స‌హ‌క‌రించిన చిత్ర బృందంలోని ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇది ఓ మ‌ధుర‌మైన ప్ర‌యాణమ‌ని తెలిపారు. 2017 డిసెంబ‌ర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది నాటి నుంచి రెగ్యుల‌ర్ గా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతూనే ఉంది. మ‌ధ్య‌లో అవాంత‌రాలు ఎదురైన‌ప్ప‌టికీ అన్నింటిని అధిగ‌మించి చిత్రీక‌ర‌ణ పూర్తిచేసారు.

ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా డీఐ ప‌నులు మొద‌లైన‌ట్లు తెలిపారు. దీంతో అక్టోబ‌ర్ లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్లేన‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. బ్రిటీష్ పాల‌కుల‌పై ఉక్కుపాదం మోపిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 250 కోట్ల‌తో నిర్మిస్తున్నారు.