బిగ్ డీల్‌: `సాహో` టీ-సిరీస్ అల‌యెన్స్‌

Last Updated on by

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ యాక్ష‌న్ ఎడ్వంచ‌ర్ మూవీ `సాహో` బిజినెస్ డీల్ గురించి తాజా తాజా అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కూ హిందీ వెర్ష‌న్ రిలీజ్‌ హ‌క్కుల్ని ఓ ప్ర‌ఖ్యాత బాలీవుడ్‌ దిగ్గ‌జ సంస్థ 120 కోట్ల‌కు కొనుక్కుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే అవ‌న్నీ అప్ప‌టికి ఊహాగానాలు మాత్ర‌మే. ఫ‌లానా సంస్థ‌కు యు.వి.క్రియేషన్స్ సంస్థ హ‌క్కుల్ని క‌ట్ట‌బెట్టింద‌ని మాత్రం రివీల్ కాలేదు.

తాజాగా ఆ దిగ్గ‌జ సంస్థ ఏది? అన్న‌దానిపై వివ‌రం తెలిసింది. ప్ర‌ఖ్యాత మ్యూజిక్ కంపెనీ కం ప్రొడ‌క్ష‌న్ హౌస్ టీ-సిరీస్ `సాహో` హిందీ రిలీజ్ హ‌క్కుల్ని ఛేజిక్కించుకుంది. ఆ మేర‌కు యు.వి.క్రియేష‌న్స్‌తో టీ-సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ ఇటీవ‌ల హైద‌రాబాద్ విచ్చేసి చ‌ర్చ‌లు సాగించారు. ప్ర‌భాస్ ఇటీవ‌లే మూడు రోజుల గ్యాప్‌లో హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. ఆ క్ర‌మంలోనే టీ-సిరీస్ అధినేత అత‌డితో హైద‌రాబాద్‌లో చ‌ర్చ‌లు సాగించార‌ని తెలుస్తోంది. ఒప్పందం ఫైన‌ల్ అయ్యిందన్న‌ది తాజా అప్‌డేట్‌. అయితే ఈ డీల్ 120 కోట్లు.. అన్న క‌న్ఫ‌ర్మేష‌న్ ఇంకా లేదు. యు.వి.క్రియేషన్స్ నుంచి అధికారిక వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉందింకా. 2019లో ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది

User Comments