ఫ‌స్ట్ లుక్: తాగితే ద‌బిడ దిబిడే

ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ చిత్రం `తాగితే తందానా`. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ చిత్రం ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమం నవంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత దామోదరప్రసాద్, నటులు ఆదిత్, సప్తగిరి, మధునందన్, హీరోయిన్స్ సిమ్రాన్ గుప్తా, రియా, దర్శకుడు శ్రీనాథ్ బాదినేని, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ అనిల్ పాలెపు, చిత్ర నిర్మాతలు వి.మహేష్, వినోద్ జంగపల్లి, నటుడు మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..  విచ్చేసిన అతిదులందరిని నిర్మాతలు బొకేలతో స్వాగతించారు. అనంతరం  రైట్ టర్న్ ఫిలిమ్స్  బ్యానర్ లోగోని దామోదరప్రసాద్ లాంచ్ చేయగా, సినిమా మొదటి లుక్ ని మారుతి ఆవిష్కరించారు..

హిట్ చిత్రాల దర్శకుడు మారుతి మాట్లాడుతూ..  రైట్ టర్న్ ఫిలిమ్స్ బ్యానర్ చాలా ఇన్నోవేటివ్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఎగ్జైటింగ్ గా అనిపించింధి. ఈ నిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు  కొత్త కాన్సెప్టులతో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆదిత్, మధు, సప్తగిరి ముగ్గురు కలిసి ఆడియెన్స్ ని ఎంటర్ టైం చేయడానికి వస్తున్నారు. వాళ్ళ లుక్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.  సప్తగిరి హీరోగా చేస్తూనే ఈ సినిమాలో కమేడియన్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడం వెరీ హ్యాపి. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకి రైట్ టర్న్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.