తాప్సీకి అన్నీ అక్క‌డేనంట‌..!

Last Updated on by

టాలీవుడ్ హీరోయిన్ల‌కు బాలీవుడ్ పెద్ద‌గా క‌లిసిరాలేదు.. సెట్ అవ్వ‌లేదు కూడా. ఎందుకో కానీ ఇక్క‌డి నుంచి వెళ్లిన ముద్దుగుమ్మ‌ల‌ను అక్క‌డోళ్లు త‌క్కువ‌గానే చూస్తారు. హిట్లు ఇచ్చిన అసిన్, ఇలియానా లాంటి హీరోయిన్ల‌ను కూడా ప‌ట్టించుకోలేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయినా కూడా అక్క‌డే త‌మ కెరీర్ అంటూ వేలాడారు కొన్నేళ్లు. ఇక ఇప్పుడు తాప్సీ కూడా ఇదే చేస్తుంది. చావైనా బ‌తుకైనా బాలీవుడ్ అంటుంది. ఈ భామ తెగింపుకు అక్క‌డి నుంచి అవ‌కాశాలు కూడా అలాగే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ఐదు సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అందులో సూర్మా జులై 13న విడుద‌ల కానుంది. హాకీ ప్లేయ‌ర్ సందీప్ సింగ్ బ‌యోపిక్ ఇది.

ఈ చిత్రంతో పాటు అమితాబ్ తో బ‌ద్లా సినిమాలో న‌టిస్తుంది తాప్సీ. ఈ చిత్రాన్ని క‌హానీ ఫేమ్ సుజాయ్ ఘోష్ తెర‌కెక్కిస్తున్నాడు. దానికితోడు అభిషేక్ బ‌చ్చ‌న్ తో మ‌న్మ‌ర్జియాన్.. ప్ర‌తీక్ బబ్బ‌ర్ తో ముల్ఖ్ సినిమాల్లోనూ న‌టిస్తుంది తాప్సీ. ఇక ఇప్పుడు మ‌రో సినిమాకు కూడా క‌మిటైంది తాప్సీ. పంజాబి యాక్ట‌ర్ క‌మ్ సింగ‌ర్ గిప్పీ గ్రేవాల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న డేర్ అండ్ ల‌వ్లీ సినిమాలోనూ తాప్సీ హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఇవ‌న్నీ కానీ హిట్టైతే దెబ్బ‌కు అక్క‌డ తాప్సీ స్టార్ అయిపోవ‌డం ఖాయం. ఎందుకంటే ఇప్ప‌టికే అక్క‌డ ఈ భామ‌కు మంచి పేరుంది. పింక్.. జుడ్వా 2 లాంటి సినిమాలతో తాప్సీ త‌న‌ను తాను నిరూపించుకుంది. ఇక ఇప్పుడు ఇవి కానీ ఆడితే అక్క‌డే త‌న జెండా పాతేయ‌డం ఖాయం.

User Comments