తాప్సి పెదాలకు ఏమైంది.. సర్జరీనా..? 

 

టాలీవుడ్ తోనే కెరీర్ ను స్టార్ట్ చేసి ఇక్కడ నటిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నానని బాలీవుడ్ కు చెక్కేసిన తాప్సి పన్ను గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ హాట్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న తాప్సి.. బాలీవుడ్ లో మాత్రం పింక్, బేబీ లాంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో కొంచెం ఎక్కువే చేసిందని చెప్పొచ్చు. అయితే, తెలుగులో మళ్ళీ ఆనందో బ్రహ్మ లాంటి సినిమాతో సోలో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడం.. టాలీవుడ్ ను తిరిగి ఆకాశానికి ఎత్తేయడంతో మన జనాలు కొంచెం శాంతించారు. అయితే, ఉన్నట్టుండి ఈ ఆనందో బ్రహ్మ పుణ్యమా అని తాప్సి గురించి ఇప్పుడు ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుండటం గమనార్హం. అదేంటంటే, ఈ సినిమా టైమ్ లో తాప్సి పెదాలకు సర్జరీ చేయించుకుందట.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తాప్సి ఇంతకుముందు నటించిన సినిమాల్లో ఉన్నట్లు ఆమె పెదాలు లేవని, కొంచెం చేంజ్ అయ్యాయని, తన నవ్వులో కూడా కొంచెం కొత్తదనం కనిపిస్తోందని.. దీనికంతటికీ లిప్ సర్జరీయే కారణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయినా హీరోయిన్స్ ఇలా పెదాలు అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్న ఆచారమే అనాలి. ఇప్పుడు కొత్తగా తాప్సి చేయించుకున్నా.. అది ఎంతవరకు సూట్ అయిందనేదే చూడాలి. అయితే, ఇదే విషయాన్ని ఆ హీరోయిన్స్ దగ్గర ప్రస్తావిస్తే మాత్రం.. ఒకరిద్దరు మినహా అందరూ సర్జరీ అంటే అలాంటిదేమీ లేదని ఎస్కేప్ అవుతారు. మరి తాప్సి కూడా నిజంగా సర్జరీ చేయించుకుంటే.. ఎస్కేప్ అవుతుందా? లేక తానేదో కరెక్ట్ గా మాట్లాడే అమ్మాయిని అనుకుంటుంది కాబట్టి నిజం చెబుతుందా? అనేది చూడాలి.