తాప్సి.. ఇక్కడ తప్పు అక్కడ తప్పు కాదా..?

సొట్ట బుగ్గల తాప్సి సౌత్ సినిమాల గురించి చేస్తున్న కామెంట్లు చూస్తే.. ఇదేంటి ఈ పిల్ల ఇలా చేస్తుంది.. అసలు తాప్సికి ఏమైంది అని అనిపిస్తుంది.  తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి ఆ సినిమాలో అందాలను బాగా ఆరబోసింది. అలా తొలి సినిమాలోనే ప్రేక్షకులకు అందాలను ఎరవేసిన ఈ అమ్మడు.. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. అవి కూడా గ్లామర్ పాత్రల్లోనే. మధ్యలో సాహసం వంటి సినిమాల్లో మాత్రం ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లో నటించి మెప్పించింది.  ఆ సినిమాలకు సంబంధించి తాప్సికి మంచి పేరే వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.  ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్ళాక అక్కడ అమ్మడు పింక్, నామ్ షబానా, బేబీ వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
దాంతో బాలీవుడ్ లో నటనకు స్కోప్ ఉండే చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయని.. కానీ, టాలీవుడ్లో మాత్రం నటనను పక్కన పెట్టి కేవలం గ్లామర్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసింది.. ఈ సొట్టబుగ్గల తాప్సి. మరిప్పుడు ఈ అమ్మడు చేస్తోంది ఏంటి. తాజాగా జుడ్వా 2 సినిమాలో టూ పీస్ బికినీ వేసుకొని కవ్వించే పనిలో ఉంది. కేవలం అందాలను ఆరబోయడానికి మాత్రమే తాప్సిని తీసుకున్నారని.. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ అమ్మడుకి ఇవ్వలేదని అక్కడి జనాలు కూడా అంటున్నారు. ఈ మేరకు జుడ్వా 2 ట్రైలర్ చూస్తే.. తాప్సి ఏ రేంజ్ లో బికినీలతోనూ, లిప్ లాక్స్ తోనూ రచ్చ చేసిందో అర్థమైపోతుంది. మరి ఈ లెక్కన తాప్సికి బాలీవుడ్ లో చేస్తే తప్పులేదు.. అదే టాలీవుడ్ లో చేస్తే.. తప్పొచ్చిందా.. అంటూ మనవాళ్ళు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మరి ఇవన్నీ విన్నాక తాప్సి ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి.