చిరుపై ఠాగూర్ మ‌ధు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `ఠాగూర్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ సినిమాని తీసిన మ‌ధు ఆ త‌ర్వాత ఠాగూర్ మ‌ధుగా పాపుల‌ర‌య్యారు. అల్లు అర‌వింద్ తో క‌లిసి `గ‌జిని` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాని ఆయ‌న ప‌రిశ్ర‌మ‌కు అందించారు. తొలి నుంచి మెగా ఫ్యాన్ గా చిరంజీవికి ఎంతో క్లోజ్ ఆయ‌న‌. అందుకే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవిని, ప్ర‌జారాజ్యం పార్టీని కామెంట్ చేస్తూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంటే ఆయ‌న ఒక అభిమానిగా స్పందించారు. ప‌వ‌న్ – చిరు జోడీపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారంపై త‌న‌దైన శైలిలో ఆయ‌న రియాక్ట్ అయ్యారు.

ఠాగూర్ మధు వ్యాఖ్యానిస్తూ.. “మీ రాజకీయాలు మీరు చేసుకోండి. క్రమశిక్షణ కు మారుపేరైన మెగాస్టార్ ను ఎందుకు లాగుతారు. మౌనంగా ఉన్న కేసీఆర్ ఊసేందుకు? భావవ్యక్తీకరణ మాత్రమే కాదు భాష కూడా ముఖ్యం అని మర్చిపోకండి“ అంటూ త‌న‌దైన శైలిలో స్పందించారు. ప‌రిశ్ర‌మ‌లో వివాదాల జోలికి వెళ్ల‌ని సౌమ్యుడిగా పేరున్న ఠాగూర్ మ‌ధు కాస్తంత ఆవేద‌న‌గానే స్పందించార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్న‌ `అర్జున్ సుర‌వ‌రం` త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. నిఖిల్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించారు. అలాగే త‌మిళంలో విశాల్ హీరోగా ఆయ‌న `అయోగ్య‌` చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. పందెంకోడి ఫ్రాంఛైజీని ఆయ‌న ర‌న్ చేస్తున్నారు.

User Comments