ఇరు భామ‌ల విలాపం

Last Updated on by

ఇరువురు సీనియ‌ర్‌ భామ‌ల విలాపం తెర‌పై చూడ‌బోతున్నాం. కేవ‌లం వారం గ్యాప్‌లో ఈ భామ‌లు న‌టించిన సినిమాలు రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌లు? అంటే అందాల క‌థానాయిక‌, తెలుగ‌మ్మాయి అంజ‌లి, మిల్కీ వైట్ సోయ‌గం త‌మ‌న్నా. అంజ‌లి క‌థానాయిక‌గా న‌టించిన `తారామ‌ణి` ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ ఎందుక‌నో ఈ సినిమా అంత‌కంత‌కు వాయిదా ప‌డుతూనే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి వేళాయింద‌న్న స‌మాచారం ఉంది. వాస్త‌వానికి ఈ నెల 7న రిలీజ్ అన్నా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక‌పోతే మ‌రో వారం గ్యాప్‌తో అంటే జూన్ 14న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించిన నా నువ్వే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా మిల్కీ కెరీర్‌తో పాటు, అటు క‌ళ్యాణ్‌రామ్‌కి ఎంతో కీల‌కం.

అంజ‌లి, త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా ఇప్పుడు మ‌రోసారి కంబ్యాక్ పొజిష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో ఈ భామ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కొంత గ్యాప్ తర‌వాత అంజ‌లి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది కాబ‌ట్టి క్యూరియాసిటీ నెల‌కొంది. త‌దుప‌రి గీతాంజ‌లి 2, గుంటూర్ టాకీస్ 2 చిత్రాల్లో అంజ‌లి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలోనూ ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. త‌మ‌న్నా ప్ర‌స్తుతం క్వీన్ రీమేక్ స‌హా వేరొక క్రేజీ చిత్రంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. గ్యాప్ త‌ర‌వాత వ‌స్తున్న‌ ఈ భామ‌ల‌కు ఆద‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి.

User Comments