మిల్కీ బ్యూటీకి లైఫ్ లైన్‌!

Last Updated on by

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఇటీవ‌ల యుట‌ర్న్ తీసుకుని ప‌రుగులు పెడుతోంది. ప్ర‌స్తుతం ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి చిత్రంలో న‌టిస్తోంది. ఇది బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్వీన్ చిత్రానికి రీమేక్. అలానే మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సైరా-న‌ర‌సింహారెడ్డిలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఎఫ్ 2 – ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్ చిత్రంలోనూ మిల్కీ న‌టిస్తోంది.

వీటితో పాటు క‌న్న‌డ‌లో కేజీఎఫ్ అనే భారీ చిత్రానికి సంత‌కం చేసింది. బాలీవుడ్‌లో కునాల్ కోహ్లీ చిత్రానికి సంతకం చేసింది. వాస్త‌వానికి బాహుబ‌లి చిత్రంలో అవంతికగా న‌టించినా ఆ త‌ర్వాత ఎందుక‌నో భారీ చిత్రాల్లో అవ‌కాశాలు రాలేదు. కానీ నెమ్మ‌దిగా త‌న కెరీర్‌ని మ‌లుపు తిప్పుకుంటూ త‌మ‌న్నా బౌన్స్ బ్యాక్ అవుతున్న‌తీరును ప్ర‌శంసించి తీరాలి. ప్ర‌స్తుతం చేస్తున్న‌వ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. వీటిలో కొన్ని స‌క్సెస్‌లు అందుకున్నా ఆ క్రేజుతో కెరీర్ గ్రాఫ్‌ని డ‌బుల్ చేయ‌డం ఈజీనే.

User Comments