మిల్కీ బ్యూటీ ఆప‌సోపాలు

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఆప‌సోపాలు పడుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. బాహుబ‌లి సిరీస్‌లో అవంతిక‌గా మైమ‌రిపించినా, మిల్కీకి ఆ త‌ర్వాత అవ‌కాశాలు రాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. సౌత్ లో మ‌ళ్లీ మిల్కీ బ్యూటీ బిజీ అవ్వ‌డానికి చాలానే టైమ్ ప‌ట్టింది. ఏడాది కింద‌టి స‌న్నివేశానికి ఇప్ప‌టికి చాలానే తేడా ఉంది.

ప్ర‌స్తుతం త‌మ‌న్నా బిజీ తార‌క. ఒకేసారి అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌లే ఎఫ్ 2-ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ సినిమాతో విజ‌యం అందుకుంది. ఈలోగానే ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి రిలీజ్ బ‌రిలోకి దిగుతోంది. ఎఫ్ 2 ప్ర‌మోష‌న్ ఓవైపు చేస్తూనే, మ‌రోవైపు ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి ప్ర‌మోష‌న్ కి రెడీ అవుతోందిట‌. ఇంకోవైపు `దేవి 2` చిత్రంలో న‌టిస్తోంది. వేరొక వైపు హిందీలోనూ వేరొక ప్రాజెక్టుతో బిజీ బిజీ. ఇంత బిజీగా ఉంది కాబ‌ట్టి మిల్కీ ఫ్ర‌స్టేష‌న్ కి గుర‌వుతోందిట‌. ఫ్ర‌స్ట‌ష‌న్ లోంచి ఒత్తిడి పెరుగుతోంది. తీవ్ర‌మైన ఒత్తిడితో ఇబ్బంది ప‌డ‌డంతో డాక్ట‌ర్లు పూర్తిగా రెండు వారాలు రిలాక్స్ అవ్వాల‌ని సూచించారు. కానీ దానిని కూడా లెక్క చేయ‌కుండా మిల్కీ త‌న షెడ్యూల్స్ ని కొన‌సాగిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత‌టి తీవ్ర ఒత్తిడిని ఖాత‌రు చేయ‌కుండా మిల్కీ ఈ తీరుగా వ్య‌వ‌హ‌రించ‌డం అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.