త‌మ‌న్నా గ్లామ‌ర్ కూడా కాపాడ‌లేక‌పోయింది

Last Updated on by

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో అతిపెద్ద డిజాస్ట‌ర్ ఏది అంటే మ‌రో మాట లేకుండా చెప్పే మాట ఆఫీస‌ర్. నాగార్జున హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం క‌నీసం కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. ఇక ఇప్పుడు దీనికి ధీటుగా మ‌రో డిజాస్ట‌ర్ కూడా వ‌చ్చింది. అదే నా నువ్వే. క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం కోటిన్న‌ర షేర్ తోనే త‌న జ‌ర్నీ ముగించేసింది. ఒక్క చోట కూడా క‌నీసం 50 ల‌క్ష‌ల షేర్ వ‌సూలు చేయ‌లేక‌పోయింది ఈ చిత్రం.
జ‌యేంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ కా బాప్ అనిపించుకుంది. త‌మ‌న్నా గ్లామ‌ర్ కూడా ఈ చిత్రాన్ని కాపాడ‌లేక‌పోయింది. ఎన్టీఆర్ వ‌చ్చి ప్ర‌మోట్ చేసినా కూడా నా నువ్వేపై ఆస‌క్తి చూపించ‌లేదు ప్రేక్ష‌కులు. 7 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే వ‌చ్చింది మాత్రం కోటిన్న‌రే. అది కూడా తొలిరోజే 80 ల‌క్ష‌లు వ‌చ్చాయి. మొత్తానికి క‌ళ్యాణ్ రామ్ కు ఇది వ‌ర‌స‌గా నాలుగో ఫ్లాప్. ప‌టాస్ త‌ర్వాత చేసిన షేర్.. యిజం.. ఎమ్మెల్యే.. నా నువ్వే ఫ్లాప్ అయ్యాయి.

User Comments