మిల్కీ బ్యూటీ ఛ‌మ్కీ నంబ‌ర్

Last Updated on by

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా స్వింగు జ‌ర .. అంటూ ఐటెమ్‌తో యూత్‌ని ప‌రేషాన్ చేసింది. ప్ర‌స్తుతం సైరా, ఎఫ్ 2 చిత్రాల్లో న‌టిస్తోంది. అలానే క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈలోగానే ఈ భామ కేజీఎఫ్ అనే త్రిభాషా చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కె.జి.ఎఫ్ య‌శ్‌-శ్రీ‌నిధి శెట్టి జంట‌గా విజ‌య్.జి నిర్మాత‌గా తెర‌కెక్కుతోంది.

కన్నడంలో రామాచారి, మాస్టర్‌ ఫీస్‌, గజికేశరి వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా తెలుగుకు ప‌రిచయ‌మ‌వుతున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో మిల్సీబ్యూటీ ఓ ప్రత్యేక గీతంలో న‌ర్తిస్తోంది. ఉగ్రం ఫేం ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకి దర్శకత్వ ం వహిస్తున్నారు. సహ నిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ ..షూటింగ్‌ మొత్తం పూర్తయ్యన ఈ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్‌ జరుపుకుంటుంది. ఇటీవ‌ల‌ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. థియేటర్‌ ట్రైలర్‌ అక్టోబరు 14న, చిత్రాన్ని నవంబరు 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.. అన్నారు. దర్శక‌నిర్మాత‌లు మాట్లాడుతూ అమెరికాకు రష్యాకు మధ్య జరిగిన యుద్దం సమయంలో నిత్యవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషులలో అత్యాశ పెరిగింది. అదే సమయంలో కె.జి.ఎఫ్‌ (కోలార్ బంగారు గనులు) భారత దేశంలోనే అతిపెద్ద బంగారు గని,అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే ఏ మవుతుంది అనే ఇతి వృత్తంతో ఈ సినిమా ని రూపొందించాం అన్నారు.

User Comments