మిల్కీ స్నేక్ డ్యాన్స్ గుభేల్‌!

Last Updated on by

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా డ్యాన్సింగ్ స్కిల్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. సౌత్‌లో ఎంద‌రు భామ‌లు ఉన్నా.. త‌మ‌న్నా క్రేజీ స్టార్‌గా ఎద‌గడానికి ఈ డ్యాన్సింగ్ స్కిల్ కూడా ఓ కార‌ణం. మెరుపువేగంతో మెలిక‌లు తిరిగే స్టెప్పులేయ‌గ‌ల‌దు. స్పీడ్ డ్యాన్స‌ర్స్ అయిన‌ మెగా హీరోల‌తో పోటీప‌డుతూ డ్యాన్సులు చేయ‌గ‌లిగిన నేర్ప‌రి. అందుకే ఇటీవ‌ల ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా సైతం త‌మ‌న్నాతో క‌లిసి వ‌రుస‌గా సినిమాలు తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు.

అయితే త‌మ్మూ డ్యాన్సింగ్ స్కిల్ గురించి ఇలా చెబితే చాల‌దు. ప్ర‌త్య‌క్షంగా చూపిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ఇదిగో ఈ వీడియో చూసేయండి. మీరు కూడా మిల్కీ డ్యాన్సుల‌కు ఫిదా అయిపోవ‌డం ఖాయం. ఓ స్విమ్మింగ్ పూల్ ముందు అదిరిపోయే లెవ‌ల్లో స్నేక్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించింది. దీనిని `డీజే స్నేక్ ఫ్రం పారిస్ టు ఇండియా` పేరుతో ఇన్‌స్టాగ్ర‌మ్‌లో రిలీజ్ చేశారు. మిల్కీ లెగ్ మూవ్‌మెంట్‌.. ఆ హ్యాండ్ మూవ్‌మెంట్స్ వెరీ స్మార్ట్‌& ఇంప్రెస్సివ్‌. చేతులు, కాళ్ల‌తో పాటు బాడీ మొత్తం ఒక స్నేక్‌లా మెలిక‌లు తిరిగిపోతోంది. ఈ వెస్ట్ర‌న్ డ్యాన్స్‌కు ఇండియ‌న్ క్లాసిక‌ల్ ట‌చ్ కూడా ఇచ్చి దుమ్ము దులిపేసింద‌నుకోండి! ఇంకా డౌట్‌గా ఉంటే మీరే చూసేయండిక‌…

User Comments