త‌మ‌న్నా ఐటెమ్ నంబ‌ర్‌

Last Updated on by

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్వీన్ రీమేక్‌ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. అలానే వెంకీ-వ‌రుణ్‌తేజ్‌ మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్‌2`లో విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అటు హిందీలోనూ ఓ రెండు సినిమాలు చేస్తోంది. `బాహుబ‌లి` త‌ర్వాత కొంత గ్యాప్ వ‌చ్చినా, ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ కెరీర్ ప‌రంగా బిజీ అయిపోయింది.

తాజాగా మిల్కీ నుంచి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ అందింది. ఈ భామ మునుప‌టిలానే మ‌రోసారి ఐటెమ్ నంబ‌ర్ల‌తో విరుచుకుప‌డ‌బోతోంది. క‌న్న‌డ యంగ్ హీరో య‌శ్ న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రంలో మిల్కీ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ చేస్తోందిట‌. 2016లో రిలీజైన క‌న్న‌డ చిత్రం `జాగ్వార్‌`లో త‌మ‌న్నా ఐటెమ్ సాంగ్‌లో చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నాళ్టికి క‌న్న‌డ సినిమాలో స్సెష‌ల్ ఐటెమ్ సాంగ్‌లో ఛాన్స్ ద‌క్కించుకుంది. కెజిఎఫ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌తో పాటు, తెలుగు, త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళంలో భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. బాహుబ‌లి అవంతిక‌గా అన్ని భాష‌ల్లోనూ సుప‌రిచిత‌మైన త‌మ‌న్నా ఐటెమ్ నంబ‌ర్ త‌మ‌కు లాభిస్తుంద‌ని యూనిట్ భావిస్తోందిట‌. ఈ ఐటెమ్ నంబ‌ర్‌కు త‌మ‌న్నా భారీ మొత్తాన్నే అందుకుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

User Comments