మ‌హేష్ అభిమానుల‌కు త‌మ‌న్నా ట్రీట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయకుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. మ‌హేష్ ఆర్మీ అధికారిగా న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. తాజాగా చిత్రంలో మంచి ఐటం సాంగ్ ని అనీల్ ప్లాన్ చేసాడు. ఆ పాట‌కు మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో స్టెప్పులు వేయిస్తున్నాడు. ఐటం పాట‌ల్లో త‌మ‌న్నా ఒదిగిపోతుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా ఇందులో సాంగ్ త‌మ‌న్నాకు ఎంత‌గానో న‌చ్చిందిట‌.

క‌చ్చితంగా అంద‌ర్ని మెప్పించేలా పెర్పామ్ చేస్తాన‌ని తెలిపింది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయ‌న సంగీతం మంచి డాన్స్ మూవ్ మెంట్స్ ప‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని ఉంటుంది. అనీల్ గ‌త సినిమా ఎఫ్-2లో న‌టించాను. త‌ను మంచి డాన్స‌ర్. ఆయ‌న ఉంటే ఎన‌ర్జీ వ‌చ్చేస్తుంది. త‌న‌తో కలిసి ప‌నిచేయ‌డం ఎప్పుడూ ఆనంద‌మేన‌ని తెలిపింది. మ‌హేష్ తో గ‌తంలో ఆగ‌డు సినిమా చేసాను. మ‌రోసారి ఆయ‌న‌తో తెర‌ను పంచుకునే అవ‌కాశం ల‌భించింది. మ‌హేష్ అభిమానుల‌కు ఈ పాట స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంద‌ని తెలిపింది. ఈ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తిచేసి సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.