మిల్కీని వ‌దిలిపెట్ట‌ని భూతం?

Last Updated on by

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాకు `దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స‌లెన్స్‌-2018` పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డంపై మీ అభిప్రాయం ఏంటి? ప‌్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ డిబేట్ ఇది. అస‌లు త‌మ‌న్నాకు ఈ అర్హ‌త ఉందా? అనేది అభిమానుల ప్ర‌శ్న‌. పైగా `బాహుబ‌లి-2`లో న‌టించినందుకు ఇంత గొప్ప పుర‌స్కారం ఇచ్చారుట‌. ఇదేం కామెడీ? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. నిన్న‌టిరోజున భ‌ళ్లాల‌దేవ పాత్ర‌ధారి రానాతో క‌లిసి అవంతిక పాత్ర‌ధారి త‌మ‌న్నా ఫాల్కే ఎక్స‌లెన్స్ పుర‌స్కారం అందుకుని, వేదిక‌పై ఆనందం వ్య‌క్తం చేశారు. ఆ క్ర‌మంలోనే ఈ పుర‌స్కారాల వేదిక‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఈ ట్వీట్‌కి ప్ర‌తిట్వీట్లు హోరెత్తిపోయాయ్‌. ఫ్యాన్స్ ఒక్కొక్క‌రు ఒక్కో కామెంట్‌తో విరుచుకు ప‌డ్డారు. అసలు నీకు ఫాల్కే పుర‌స్కారం ఎలా వ‌చ్చింది? నీకంటే చిన్న చిన్న క్యారెక్ట‌ర్లే గొప్ప‌గా పండాయి క‌దా.. అని ఒక అభిమాని అంటే, “రానా తీస్కున్నాడు స‌రే.. నీకెందుకు?“ అంటూ వేరొక అభిమాని తిట్టేశాడు. త‌మ‌న్నాకు బాహుబ‌లి 2 అవార్డా? అంటూ వెట‌కారం ఆడారు. దీనిని బ‌ట్టి అవార్డులు ఇచ్చేవాళ్ల‌కు బుద్ధి లేద‌ని అర్థం చేసుకున్నారు ఇత‌ర జ‌నం. ఇటీవ‌లి కాలంలో ఓ ర‌కంగా జ‌నాల‌కు అవార్డుల‌పైనే విర‌క్తి క‌ల‌గ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందో దీనిని బ‌ట్టి ఊహించ‌వ‌చ్చు. అయితే ఈ త‌ర‌హా అక్షింత‌లు కేవ‌లం మిల్కీకే ప‌రిమితం కాదు, గ‌తంలోనూ ప‌లు అవార్డుల ప్ర‌క‌ట‌న వేళ సూటిగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న న‌టీన‌టులెంద‌రో ఉన్నారు.

User Comments