20 ఏళ్ల‌కే అన్నీ చూసేసిన త‌మ‌న్నా

Last Updated on by

ప‌దేళ్ల‌కే అన్నీ చేసేస్తే పాతికేళ్ల‌కు టీవీ చూడ‌టం త‌ప్ప ఇంకేం చేస్తాడులే అని అత‌డులో ఓ డైల‌గ్ ఉంటుంది. ఇప్పుడు త‌మ‌న్నాకు ఇది బాగా సూట్ అవుతుంది. అయితే ఇక్క‌డ ప‌దేళ్ల‌కే కాదు.. 15 ఏళ్ల‌కే అన్న‌మాట‌. అవును.. త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే 13 ఏళ్లు అయిపోయింది. ఆమె ఏజ్ మాత్రం ఇప్ప‌టికీ 30 దాట‌లేదు. దానికి కార‌ణం చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్ అయిపోవ‌డ‌మే. నిండా పాతికేళ్లు కూడా నిండకుండానే అన్ని ఇండ‌స్ట్రీల‌ను చుట్టేసింది త‌మ‌న్నా. 15 ఏళ్ల‌కే హీరోయిన్ అయిపోయింది.. 20 వ‌చ్చేస‌రికి స్టార్ అయింది.. పాతికేళ్ళ లోపే ద‌క్షిణాదిన ఉన్న టాప్ హీరోలంద‌రితోనూ రొమాన్స్ చేసింది. ఇప్పుడు 28 వ‌చ్చాయి. ఇప్ప‌టికే అంద‌రితోనూ ఆడిపాడేసింది. దాంతో త‌మ‌న్నాపై ఇప్పుడు స్టార్ హీరోలు చిన్న‌చూపు చూస్తున్నారు. ఆల్రెడీ న‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ మ‌ళ్లీ న‌టించ‌డం ఎందుకు అని ప‌క్క‌న బెట్టేస్తున్నారు. పైగా స్టార్స్ తో ఈ మ‌ధ్య న‌టించిన ఒక‌టి అరా సినిమాలు కూడా బాల్చీ త‌న్నేసాయి.

ఈ మ‌ధ్యే త‌మిళ్ లో విక్ర‌మ్ తో న‌టించిన స్కెచ్ సినిమా ప్లాప్ అయింది. ఈ చిత్రం పెద్ద‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భావం చూపించ‌లేదు. ఈ చిత్రం త‌ర్వాత తమిళ‌నాట క్రేజ్ పోయింది త‌మ‌న్నాకు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్.. ప్ర‌భాస్.. ప‌వ‌న్ లాంటి స్టార్స్ తో న‌టించిన త‌మ్మూ.. ఇప్పుడు సందీప్ కిష‌న్.. క‌ళ్యాణ్ రామ్ అంటూ చిన్న హీరోల‌తో స‌ర్దుకుపోతుంది. కెరీర్ కొత్త‌లో మాత్ర‌మే ఇలా చిన్న హీరోల‌తో న‌టించింది త‌మ‌న్నా. కానీ ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ అదే చేస్తుంది. క‌ళ్యాణ్ రామ్ తో జ‌యేంద్ర నా నువ్వే సినిమాలో న‌టిస్తుంది. ఇక సందీప్ కిష‌న్ తో కునాల్ కోహ్లీ తెర‌కెక్కిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. వాట‌న్నింటితో పాటు క్వీన్ సినిమా రీమేక్ లో న‌టిస్తుంది త‌మ‌న్నా. ఈ చిత్రాన్ని నీల‌కంఠ తెర‌కెక్కిస్తున్నాడు. ఆ మ‌ధ్య ద‌ర్శ‌కుడితో గొడ‌వ‌లు అయిన‌ట్లు వార్త‌లొచ్చినా అందులో నిజం లేద‌ని చెప్పింది త‌మ‌న్నా. ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి చూడాలి.. ఏం జ‌రుగుతుందో..?

User Comments