సూర్య ఎన్జీకే బిజినెస్ డీటైల్స్

త‌మిళ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎన్జీకే (నంద గోపాల కృష‌) ఈనెల 31న భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `సింగం-2` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతోన్న సూర్య మార్కెట్ తెలుగులో కూడా త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో ఎన్జీకే తో స‌క్సెస్ అందుకుని గ‌త వైభ‌వాన్ని అందుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత రాధ‌మోహ‌న్ రైట్స్ దక్చించుక‌ని రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగు వెర్ష‌న్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు  చురుకుగా జ‌రుగుతు న్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగు రైట్స్ 9 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. అలాగే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వివ‌రాలు లీక్ అయ్యాయి.

సూర్య పారితోషికం 35 కోట్లు కాగా, సెల్వ‌రాఘ‌వ‌న్ 5 కోట్లు, ఇత‌ర న‌టీన‌టులు 5 కోట్లు, సినిమా నిర్మాణానికి 15 కోట్లు కాగా..మొత్తంగా 60 కోట్ల‌లో సినిమా పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది. త‌మిళ్ థియేట్రిక‌ల్ రైట్స్ 50 కోట్లు, తెలుగు 10 కోట్లు, శాటిలైట్ 30 కోట్లు, డిజిట‌ల్ రైట్స్ 10 కోట్టు, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ 10 కోట్లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా రిలీజ్ కు ముందే 110 కోట్ల బిజినెస్ జ‌రిగింది. మ‌రి గోపాల కృష్ణుడు ఆ అంచ‌నాల‌ను అందుకుంటాడో ? లేదో? చూద్దాం.