రామ్ కోసం `విజిల్` పాప

తమిళ కథానాయకుడు విజయ్ నటించిన `విజిల్` సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు మెరిశారు. అందులో మహిళా ఫుట్బాల్ టీమ్కి కెప్టెన్గా కనిపించిన అమృత అయ్యర్ తన అందంతో ఆకట్టుకుంది. ఆమెకి తెలుగు నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తోందామె. తాజాగా రామ్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా `రెడ్` సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయవంతమైన ఓ సినిమాకి రీమేక్ ఇది. ఇప్పటికే ఇందులో నివేతా పేతురాజ్తో పాటు, మరో భామ కూడా నటిస్తోంది. తాజాగా మూడో ముద్దుగుమ్మగా అమృత అయ్యర్ ఎంపికైందన్నమాట. ఈమె అందాన్ని చూస్తుంటే కొన్నాళ్లపాటు తెలుగు సినిమాల్లో మెరిసేలాగే కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి!

అమృత అయ్యర్