బిగ్ బాస్ 2లో లిప్ టు లిప్ ముద్దులు

Last Updated on by

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం ఇప్పుడు. నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ 2లో లిప్ లాక్స్ పెట్టేస్తున్నారు. ఈ విజువ‌ల్స్ చూసి ప్రేక్ష‌కులు కూడా షాక్ అవుతున్నారు. అస‌లేంటండీ ఈ ఛండాలం అంటూ విమ‌ర్శిస్తున్నారు. అయితే ఇదంతా మ‌న తెలుగులో కాదులెండీ.. మ‌న ద‌గ్గ‌ర తిట్టుకున్నా కూడా కాస్త యు స‌ర్టిఫికేట్ తోనే షో న‌డుస్తుంది. కానీ త‌మిళ‌నాట మాత్రం ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చేసింది అప్పుడే. అక్క‌డ ఈ మ‌ధ్యే ఓ టాస్క్ లో భాగంగా జననీ అయ్యార్, ఐశ్వర్యదత్త లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకున్నారు. ఇది అలాగే టీవీల్లో ప్లే చేసారు కూడా. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ 2పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసేలా చేస్తుంది. టాస్కులు ఇచ్చినా కూడా మ‌రీ ఇంత ప‌చ్చిగా దాన్ని పూర్తి చేయాలా అంటున్నారు ప్రేక్ష‌కులు. టాస్కుల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజూ టీవీల్లో వ‌చ్చే రియాలిటీ షోల్లో ఇలాంటి అస‌హ్య‌మైన టాస్కులు ఇస్తుంటే ఎలా ఉంటుంద‌ని షోపై మండి ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు.

ప్రేక్షకులకు మంచి వినోదం పంచేవ‌ర‌కు ఓకే కానీ ఇలా మితిమీరిన ప‌నులు మాత్రం మంచిది కాదంటున్నారు వాళ్లు. ఇదొక్క‌టే కాదు.. త‌మిళ బిగ్ బాస్ 2లో ఇంకా చాలా హ‌ద్దు మీరుతున్నాయి. మొన్నీమ‌ధ్యే ఓ టాస్క్ లో భాగంగా మాజీ హీరోయిన్ ముంతాజ్ డైపర్లు మార్చుకోవ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా ఆమె డైపర్లు వేసుకుని తిరగడం ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చేసింది. త‌మిళ్ తో పోల్చుకుంటే తెలుగులో షో చాలా బాగుంది. ఇక్క‌డ మొద‌ట్లో కాస్త నెగిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్పుడు అంతా సెట్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. అయితే ఇక్క‌డ కూడా ఈ మ‌ధ్యే బిగ్ బాస్ లో వ‌చ్చిన ఒక‌ట్రెండు టాస్క్ ల‌పై బాబు గోగినేని తీవ్రంగా మండి ప‌డ్డారు. దెబ్బలు త‌గిలేలా టాస్కులు ఇవ్వ‌డ‌మేంటని ఆయ‌న నిల‌దీసారు. దానికి హోస్ట్ నాని కూడా సారీ చెప్పి త‌మ త‌ప్పు ఒప్పుకున్నారు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పారు. మొత్తానికి బిగ్ బాస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది

User Comments