అక్కడ నుంచీ ఓ ఫైటర్

తెలుగులో పూరి జగన్నాథ్ ఓ ఫైటర్ని సిద్ధం చేస్తున్నాడు. అందులో విజయ్ దేవరకొండ హీరో. బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. పూరి బాక్సింగ్ కథని తెరకెక్కించడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి` తెరకెక్కించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. మరి బాక్సింగ్ పూరికి మరోసారి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. అన్నట్టు ఈసారి పాన్ ఇండియా రేంజ్ సినిమా కూడా! దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే తెలుగులో పూరిలాగే… తమిళంలో కూడా ఓ ఫైటర్ సిద్ధమవుతున్నాడు. రజనీకాంత్తో చిత్రాలు తీసిన పా.రంజిత్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. ఇక హీరో ఎవరంటే… ఆర్య. ఈయన తాజాగా ఓ రేంజ్లో కండలు పెంచేశాడు. బాక్సింగ్ కథ, అందులోనూ ఆర్యలాంటి భారీకాయుడు హీరో. ఇక ఫైటింగులు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి ఈ ఇద్దరు ఫైటర్ల గురించి దక్షిణాది జనాలు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు.