సింగం బ‌ర్త్ డే స్పెష‌ల్ : సూర్య‌@44

త‌మిళ హీరో సూర్య ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పెద్ద స్టార్. కోలీవుడ్ స్టార్ అయినా టాలీవుడ్ టాప్ హీరోల‌తో స‌మానం. క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి ఛ‌రిష్మా క‌ల్గిన న‌టుడు. భారీ డైలాగులు చెప్పాల‌న్నా…..రౌడీల తుప్పు వ‌ద‌ల‌గొట్టాల‌న్నా! యాక్ష‌న్ ని పీక్స్ లో చూపించాల‌న్నా సూర్య త‌ర్వాతే. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లోనూ త‌ద‌నైన మార్క్ చాటారు. ఒకే జాన‌ర్ కు ప‌రిమిత‌మైతే ఎలా అని అప్పుడ‌ప్పుడు కుటుంబ క‌థా చిత్రాల్లోనూ మెప్పించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. అలా చేసిన‌ప్పుడ‌ల్లా పాత్ర‌కే వ‌న్నె తీసుకొచ్చిన న‌టుడు. గ‌జినితో మొద‌లైన సినీ ప్ర‌యాణం మొన్న‌టి ఎన్జీకే వ‌ర‌కూ ఎన్నో స‌క్సెస్ లు. విజ‌యాలు వ‌చ్చిన‌ప్పుడు పొంగిపోలేదు…అప‌జ‌యాలు ఎదురైన‌ప్పుడు కృంగిపోని వ్య‌క్తిత్వం గల స్టార్.

ఇటు నిర్మాణ రంగంలోనూ స‌త్తా చాటుతున్నారు. త‌న‌యులు దేవ్ దియా పేరుతో స్థాపించిన నిర్మాణ సంస్థ‌ను ముందుండి న‌డిపిస్తున్నారు. 22 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో అవార్డ‌లు..రివార్డులు. తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని ఫుణికి పుచుకున్న సూర్య కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది.తండ్రిని మించిన త‌న‌యుడిగా కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ నిరూపించుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే? రజనీకాంత్ తరువాత లింగాయత్ వర్గం నుంచి దక్షిణ భారత స్థాయిలో గుర్తింపు ఉన్న ఏకైక నటుడు కావ‌డం విశేషం. సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. సొంతంగా స్వ‌చ్చంద సేవాసంస్థ‌ల‌ను న‌డుపుతున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ప్ర‌త్యేక క‌థ‌నం. నేటితో 43 పూర్తి చేసుకుని 44 వ ప‌డిలోకి అడుగు పెట్టారు. అయినా 30 ఏళ్ల కుర్రాడిలానే క‌నిపిస్తాడు. అదే సూర్య స్పెషాలిటీ. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.