త‌మిళ పొంగ‌ల్ కూడా అంతేనా..!

Last Updated on by

సంక్రాంతి తెలుగు ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే కాదు.. త‌మిళ వాళ్ల‌కు కూడా సినిమా పండ‌గే. రైతులు ఏడాదంతా క‌ష్ట‌ప‌డి కొత్త పంట‌ను కోత‌కు తెచ్చిన‌ట్లు.. హీరోలు కూడా ఏడాదంతా సినిమాలు చేసి సంక్రాంతికి విడుద‌ల చేస్తుంటారు. ఇప్ప‌టికే తెలుగు సంక్రాంతి ఈ ఏడాది డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు త‌మిళ సంక్రాంతి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. అక్క‌డ నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అన్నింట్లో ఒక్క‌టి మాత్రమే యావ‌రేజ్ అనిపించుకుని.. మిగిలిన మూడు అడ్ర‌స్ లేకుండా పోయాయి. జ‌న‌వ‌రి 12న సూర్య న‌టించిన తాన సేరంద కూట్టం విడుద‌లైంది. ఈ చిత్రం జ‌స్ట్ ఓకే అనిపించుకుంది. క‌మ‌ర్షియ‌ల్ గా సూర్య ఇమేజ్ తో బాగానే వ‌సూలు చేస్తుంది ఈ చిత్రం. అయితే హిట్ అనిపించుకోవాలంటే మాత్రం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది.

ఇక సూర్య‌కు పోటీగా జ‌న‌వ‌రి 12నే విక్ర‌మ్ న‌టించిన స్కెచ్ వ‌చ్చింది. ఇదైతే క‌నీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. దాన్ని బ‌ట్టే అర్థ‌మైపోతుంది విక్ర‌మ్ రేంజ్ ఎంత‌గా ప‌డిపోయిందా అని..! విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం విక్ర‌మ్ ఖాతాలో మ‌రో  ఫ్లాప్ గా నిలిచిపోయింది. జ‌న‌వ‌రి 12నే వ‌చ్చిన గులేభ‌కావ‌ళి కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రం నిధి వేట నేప‌థ్యంలో సాగుతుంది. ఇక పొంగ‌ల్ కే వ‌చ్చిన మ‌రో రెండు చిన్న సినిమాలు కూడా అడ్ర‌స్ లేకుండా పోయాయి. మొత్తానికి ఇటు తెలుగు.. అటు త‌మిళ ఇండ‌స్ట్రీల‌కు ఈ సారి పండ‌గ పెద్ద‌గా క‌లిసిరాలేదు.

User Comments