తమిళ్ రాకర్స్ జిందాబాద్!! 

Last Updated on by

తమిళ్ రాకర్స్ జిందాబాద్!!

 

స్వాతి పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అడ్డా’. జి.యస్.కార్తిక్ దర్శకుడు. నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి కీలక పాత్రధారులు. ఎ పైరేటెడ్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో బుధవారం ఉదయం విడుదల చేశారు. సీనియర్ ఫొటోగ్రాఫర్ జనార్దన్, వీడియోగ్రాఫర్ పొన్నం శ్రీనివాస్ సంయుక్తంగా టీజర్ విడుదల చేశారు. ముఖ్య అతిథి బి.ఎ.రాజు మాట్లాడుతూ “దర్శకుడు కార్తిక్ మా సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశారు. అడ్డా వంటి హిట్ సినిమా చేశారు. టాలెంటెడ్ డైరక్టర్ అతను. నవీన్ చంద్రకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది. పైరసీని అరికట్టాలని చాలా మంది చాలా ర కాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్‌లో ఉంటుంది. లవ్‌స్ట్టోరీ కూడా ఉంది. మంచి హిట్ కావాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు” అని అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ “మంచి టైటిల్ కుదిరింది. మార్నింగ్ షో కూడా పూర్తి కాకుండానే మొబైల్స్ లోకి పైరసీ ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా ఆ సబ్జెక్ట్ మీద ఉండటం ఆనందంగా ఉంది. నవీన్ నాకు మంచి ఫ్రెండ్. ఇటీవల ౠఅరవింద సమేతౠలోనూ చాలా బాగా చేశాడు. అతనితోనూ ఆ విషయాన్ని చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి”అని అన్నారు.

దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ “అడ్డా తర్వాత గ్యాప్లో తీసిన సినిమా ఇది. పైరసీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇందులో నవీన్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉంటుంది. ఇండస్ట్రీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపించే కుర్రాడిగా నవీన్ నటిస్తారు. నిర్మాత కూతురుగా హీరోయిన్ కనిపిస్తుంది. పూజా జవేరి గ్లామర్ పాత్రలోచేసింది. ఇండస్ట్రీలోని హీరోలకు, నిర్మాతలకు త్వరలోనే ఓ షో వేస్తాం. నిర్మాత నాకు మంచి స్నేహితుడు. మా షో చూడటానికి తమిళ పరిశ్రమ నుంచి విశాల్ కూడా వస్తున్నారు”అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ “పైరసీ అనేది ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ. కమర్షియల్ ఎలిమె

User Comments