అమ్మ బ‌యోపిక్ కు అంతా సిద్ధం..!

Last Updated on by

ఈ రోజుల్లో బ‌యోపిక్స్ కు ఉన్న డిమాండ్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. లెజెండ్స్ లైఫ్ తో పాటు అంద‌రి జీవితాలు ఇప్పుడు తెర‌కెక్కుతున్నాయి. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే బ‌యోపిక్ ల‌కు క్రేజ్ పెరుగుతుంది. సావిత్రి జీవితం ఆధారంగా వ‌చ్చిన మ‌హాన‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ కు కూడా రంగం సిద్ధ‌మైంది. బాల‌య్య హీరోగా క్రిష్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రం అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌నుంది. సంక్రాంతికి విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మించ‌నున్నారు బాల‌య్య‌తో క‌లిసి.
ఇక ఇప్పుడు ఇదే నిర్మాత నుంచి మ‌రో బ‌యోపిక్ కూడా రాబోతుంది. అదే త‌మిళనాడుకు అమ్మ‌.. దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్. ఈమె జీవితాన్ని ఇప్పుడు తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. విష్ణు ఇందూరి ఈ ప్రాజెక్ట్ త‌న చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అమ్మ పాత్ర కోసం న‌య‌న‌తార‌ను ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీనికి ఇంకా న‌య‌న్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. అయితే జ‌య‌ల‌లిత అంటే ప్ర‌త్యేక అభిమానం ఉన్న న‌య‌న‌తార‌.. ఈ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి ఒప్పుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

User Comments