పొగ తాగితే త‌ప్పేంటి?

Last Updated on by

పింక్‌, నామ్ ష‌బానా చిత్రాల‌తో న‌టిగా చ‌క్క‌ని పేరు తెచ్చుకుంది తాప్సీ. జుడ్వా చిత్ర ంతో వంద కోట్ల క్ల‌బ్ నాయిక‌గా మెరిసి, తాజాగా ముల్క్ చిత్రంలో న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస అందుకుంది. తాజాగా తాప్సీ న‌టించిన మ‌న్మార్జియాన్ రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. శిక్కు యువ‌కులు, గురుద్వారా నేప‌థ్య ంలో తీసిన ఈ ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్రంలో తాప్సీ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లొచ్చాయి. అయితే స‌క్సెస్‌తో పాటు ఈ సినిమా వివాదాల్ని మోసుకొచ్చింది. ఇందులో రాబీ పాత్ర పోషించిన అభిషేక్ బచ్చన్ గురుద్వారా లో తన పెళ్లి తంతు పూర్తికాగానే బయటకు వచ్చిన తలపాగా తీసి సిగరెట్ వెలిగిస్తాడు. ఈ సీన్ పై గురుద్వారా అధిప‌తులు అభ్య ంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. శిక్కుల్లో తీవ్ర అభ్య ంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఆ స‌న్నివేశాల్ని తొల‌గించారు. దీనిపై తాప్సీ ట్విట్ట‌ర్‌లో సీరియ‌స్‌గానే స్ప ందించింది.

“ఆ సీన్ తీసేసినందువల్ల పంజాబ్ లో ఉండే స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం దొరికిన‌ట్టే. పంజాబ్‌ స్వర్గం అవుతుంది. ఈసారి మీకు ఒక సినిమా వల్ల ఇబ్బంది ఎదురైతే కిషోర్ లుల్లా(ఈరోస్ అధినేత) కు కాల్ చేయండి.. పరిష్కారం క్షణాల్లో లభిస్తుంది“ అంటూ వ్య ంగ్య ంగా ట్వీట్ చేసింది. సామాజిక మాధ్య‌మాల్లో తిట్టేసేవారికి టోకుగా చురకలంటించింది. ఏ సిక్కు అయినా పొగ తాగొద్దు. ఏ మహిళ కూడా గురుద్వారాలో పెళ్ళిచేసుకునే సమయంలో ఎవరి గురించి అసలు ఆలోచించకుండా ఉండాలంటే ఈ సీన్ కట్ చేయాల్సిందే అంటూ ట్వీట్ చేసింది. ఈ గొడ‌వ ఎంత‌వ‌ర‌కూ వెళుతోందో ఏంటో?

User Comments