తార‌క్ హీరోయిన్ ఎట్టకేల‌కు

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన న‌టించే భామ ఎవ‌రు? అన్న‌ది ఇన్నాళ్లు సస్పెన్స్ గా నిలిచింది. ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత నాయిక‌ను వెతికేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు ఆ భామ‌ను వెతికి ప‌ట్టుకున్నారు. తార‌క్ స‌ర‌స‌న‌ నటిస్తోన్న హీరోయిన్ ను ప్రకటించనున్నామని చిత్రబృందం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ అని తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ..ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అని పోస్ట్ చేశారు.

ఇందులో కొమురం భీమ్ పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డే అమ్మాయి ఈవిడేన‌ట‌. ఇక‌పోతే అల్లూరి సీతారామ‌రాజు స‌ర‌స‌న సీత పాత్ర‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.