మ‌హేష్ అన్న‌పై తార‌క్ త‌మ్ముడు పొగడ్త‌!

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌ట‌న‌కు లోకం మొత్తం ఫిదా అయిపోయింది. రాజ‌మౌళి వంటి ఉద్ధండుడే సీఎం భ‌ర‌త్ పాత్ర‌లో మ‌హేష్ గొప్ప‌గా న‌టించాడ‌ని ప్ర‌శంసించారు. టాలీవుడ్ ద‌ర్శ‌కులంతా మ‌హేష్ న‌ట‌న‌ను, కొర‌టాల సినిమా తీసిన తీరును పొగిడేశారు. ఛాయాగ్రాహ‌కుడు ర‌వి.కె.చంద్ర‌న్ మాట్లాడుతూ .. మహేష్ న‌ట‌న‌కు జాతీయ అవార్డునే ఇవ్వాల‌ని పొగిడేశారు. ఇప్పుడు తార‌క్ వంతు..
సండే వేళ టిక్కెట్ కొనుక్కుని చూశాడో.. ఇంకెలా చూశాడో కానీ తార‌క్ `భ‌ర‌త్ అనే నేను` సినిమా చూశాడు. ఆ వెంట‌నే ట్విట్ట‌ర్‌లో ట‌చ్‌లోకొచ్చాడు. “సామాజిక బాధ్య‌త‌కు క‌మ‌ర్షియాలిటీని జోడించి సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. ఈ రెండు విష‌యాల్ని ఎంతో అందంగా బ్యాలెన్స్ చేశాడు కొర‌టాల‌. అత్య‌ద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచిన మ‌హేష్ అన్న‌కు శుభాకాంక్ష‌లు. మొత్తం టీమ్‌కి శుభాకాంక్ష‌లు. భ‌ర‌త్ నిజాయితీగా తీసిన గొప్ప సినిమా“ అంటూ పొగిడేశాడు తార‌క్‌. ఆ వెంట‌నే రీట్వీట్‌లో తార‌క్‌కు డి.వి.వి సంస్థ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

User Comments