మెగాక్యాంప్‌కి అయ్య‌వారి సాయం

Last Updated on by

తెలుగు సినిమాల్ని బాలీవుడ్‌లోనూ ప్ర‌మోట్ చేస్తూ ఎంతో మేలు చేస్తున్నారు ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించ‌డం ఆయ‌న ప‌ద్ధ‌తి. `బాహుబ‌లి` సిరీస్ సృష్టించిన సంచ‌ల‌నాల‌తో మ‌న ప‌రిశ్ర‌మ‌ను బ‌డా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ పెద్ద‌లంతా గుర్తించారు. ఇటీవ‌లే రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను చిత్రాలు విదేశాల్లో సాధించిన ప్ర‌భంజ‌నంపైనా క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ ప్ర‌త్యేకించి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. విదేశీ బాక్సాఫీస్ వ‌ద్ద టాలీవుడ్ హిందీ ప‌రిశ్ర‌మ‌కే పోటీనిస్తోంద‌ని పొగిడేశారు.

కేవ‌లం పెద్ద సినిమాల‌కే కాదు.. అప్పుడ‌ప్పుడు చిన్న సినిమాల్ని, కొత్త ముఖాల్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న చేస్తున్న సేవ‌లు అన‌న్య‌సామాన్యం. తాజాగా మెగా అల్లుడు క‌ళ్యాణ్‌కి త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ప్ర‌చారం చేయ‌డం ఫిలింన‌గ‌ర్‌లో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చింది. చ‌ర‌ణ్, బ‌న్ని, వ‌రుణ్‌తేజ్, శిరీష్‌, సాయిద‌ర‌మ్‌ సినిమాల‌కు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఇదివ‌ర‌కూ ప్ర‌చారం చేశారు. ఇప్పుడు అదే కాంపౌండ్ నుంచి వ‌స్తున్న క‌ళ్యాణ్ దేవ్ సినిమాకి ప్ర‌చారం చేస్తున్నారు.

మెగాకాంపౌండ్‌కి బాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయ‌న ఈ ప్ర‌చారం నిర్వ‌హించి ఉండొచ్చు. ఇక‌పోతే ఇదివ‌ర‌కూ అల్లు శిరీష్ గౌర‌వం, ఒక్క క్ష‌ణం చిత్రాల‌కు ఆయ‌న ప్ర‌చారం చేయ‌డం విశేషం. తెలుగు సినిమా స‌రిహ‌ద్దులు చెరిపేసి ఇరుగు పొరుగున స‌త్తా చాటుతున్న ఈ వేళ త‌ర‌ణ్ ప్ర‌మోష‌న్ మ‌రింత‌గా క‌లిసొచ్చేదే. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అంద‌రికీ ఆయ‌న ప్ర‌చారం అవ‌స‌రం. ఈ ప్రోత్సాహం ఇక‌పైనా ఇలానే సాగాల‌ని ఆకాంక్షిద్దాం.

User Comments