వీడియో: ట్యాక్సీవాలా వ్య‌స‌నం?

Last Updated on by

ఒక్క `అర్జున్‌రెడ్డి`తో వెయ్యి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కుటుంబ హీరోల పాల‌న సాగుతున్న టాలీవుడ్ కేవ‌లం ఏ ఒక్క‌రికో అంకితం కాద‌ని నిరూపించాడు.ప్ర‌తిభ‌ను ఎవ‌రూ దాచిపెట్ట‌లేర‌ని, ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ ఎవ‌రినీ తొక్కిప‌ట్ట‌లేర‌ని నిరూపించాడు. `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`లో సైడ్ హీరో. పెళ్లి చూపులు లాంటి ప్ర‌యోగంతో సోలో హీరోగా స‌త్తా చాటాడు. అటుపై `అర్జున్‌రెడ్డి`తో స్టార్ హీరోల కేటగిరీని ట‌చ్ చేశాడు. న‌టించిన మూడో సినిమాతోనే ఆ లెవ‌ల్ స‌క్సెస్ వేరే ఏ హీరోకి లేదు. కంటెంటు, కాన్సెప్టు ఇండ‌స్ట్రీని న‌డిపిస్తున్న వేళ అస‌లు ఇక్క‌డ కాంపిటీష‌న్ అన్న‌దే లేదు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న విభేధం అస‌లే లేదు. ప్ర‌తిభ ముందు ఇవ‌న్నీ ఓట‌మిపాల‌వుతున్నాయి. అందుకే దేవ‌ర‌కొండ లాంటి మ‌రెందరో హీరోలు పుట్టుకురావాల‌ని జ‌నం ప‌దే ప‌దే కోరుకుంటున్నారు.

అదంతా అటుంచితే, అస‌లు దేవ‌ర‌కొండ‌కు ఈ స్థాయి ఎలా వ‌చ్చింది? అంటే అత‌డి ఎంపిక‌ల‌దే మెజారిటీ పార్ట్ క్రెడిట్‌. విభిన్న‌మైన కాన్సెప్టుల్ని, పెర్ఫెక్ట్ మేక‌ర్‌ని ప‌ట్టుకున్న‌వాడే మొన‌గాడు ఇక్క‌డ‌. ఆ సంగ‌తిని పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి నిరూపించాయి. అందుకు ఆద్యుడు మాత్రం దేవ‌ర‌కొండ‌నే. ఇదిగో ఇప్పుడు సేమ్ టు సేమ్ ట్యాక్సీవాలా ఆ కేట‌గిరీలోనే ఉండ‌బోతోంద‌ని వీడియో సాక్షిగా చెప్ప‌క‌నే చెప్పాడు. అస‌లు ట్యాక్సీ వాలా కాన్సెప్టు, కంటెంట్ ఏంటో సింపుల్ వీడియోలో చూపించేశాడు. వ్య‌స‌నానికి బానిసైన వాడిని దానినుంచి బ‌య‌ట‌ప‌డేస్తాడా? అలాంటి కాన్సెప్టు ఏదో ట‌చ్ చేస్తున్నాడా? అన్న సందేహాన్ని ర‌గిలించింది. కంటెంట్‌తో సందేశం బావుంది కొండా! అంటూ మెచ్చుకుంటున్నారు ఈ వీడియో చూసి. ప‌నిలో ప‌నిగా ఆ చిన్నారి గూండాల వ్య‌వ‌హార‌మేంటో కూడా తెర‌పైనే చూడాలి.
అదిరిపోయే కంటెంట్‌తో నాలుగు స్క్రిప్టులు ఉంటే, అందులోంచి ఏది ఎంచుకోవాలో అర్థంకాని స‌న్నివేశంలో ఈ స్క్రిప్టును ఎంపిక చేసింది చిన్నారి గూండాలే! అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు దేవ‌ర‌కొండ‌. ది డ్రీమ్ బిహైండ్ ట్యాక్సీవాలా.. అంటూ అత‌డు రిలీజ్ చేసిన ఈ వీడియో జోరుగా వైర‌ల్ అవుతోంది వెబ్‌లో.

User Comments