వ‌ర్మ‌పై టీడీపీ లేడీస్ ఫైర్

గ‌త మూడు రోజులుగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయినా ఇంకా వివాదం ఆయ‌న్ని వద‌ల్లేదు. ఏపీ లో రిలీజ్ కోసం ప్ర‌త్య‌ర్ధుల‌తో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు. వ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిల‌వ‌డంతో టీడీపీ లేడీస్ అందుకున్నారు. వ‌ర్మ‌ని, జ‌గ‌న్ క‌లిపి విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. మాజీ న‌టి దివ్వ‌వాణి ఓ అడుగు ద‌మ్ముంటే వ‌ర్మ జ‌గ‌న్ హ‌త్యారాజ‌కీయాల‌పై సినిమా చేయాల‌ని స‌వాల్ విసిరింది. విజ‌య‌వాడ పోలీసులు వ‌ర్మ‌ని అడ్డుకుని మంచి ప‌నిచేసారు. అలాంటి వ్య‌క్తికి అలాగే జ‌ర‌గాలి.

ల‌క్ష్మీపార్వతి పాత్ర‌ను ఉద్దేశిస్తూ, `ఆమె ఎలాంటిందో దేశం మొత్తానికి తెలుసు.ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ చంపిన చ‌రిత్ర ఆమెది. అన్న‌గారి జీవితంలో ఆమె విష‌పు చుక్క‌. ల‌క్ష్మీ పార్వతి గురించి ఆమె భ‌ర్త ఎప్పుడో చెప్పారు. ఇక‌నైనా వ‌ర్మ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఆయ‌న వెనుక జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి ఉన్నార‌ని ఆరోపించింది. ఇక మ‌రో ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని ఆర్జీవీ ఒక సైకో. అలాంటి సైకాకోకి జ‌గ‌న్ మ‌ద్దుతు తెల‌ప‌డం విడ్డూరంగా ఉందంది. మరీ వ్యాఖ్య‌ల‌పై వ‌ర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.