ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్ ఎత్తేయాలి..లేదంటే?

Last Updated on by

ఏపీ అసెంబ్లీ అంత‌కంత‌కు హీటెక్కుతోంది. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య యుద్ధం సాగుతోంది. ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. తేనీటి విరామ సమయంలో ఉపసభాపతి కోన రఘుపతితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై చర్చించారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని, దానిని కూడా కాలరాయడం అప్రజాస్వామికమతుందని డిప్యూటీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్థానంలోనే ఉన్నారని, అతడిని సస్పెండ్‌ చేయడం దారుణమని ఆయనతో చెప్పారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తొలిసారి సస్పెండ్‌ చేశారని, ఇది అన్యాయమని అన్నారు.నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ బలవంతంగా మోసుకుపోవడం అప్రజాస్వామికమని వారందరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిప్యూటీస్పీకర్‌ను కోరారు.దీనిపై స్పందించిన ఆయన అధికారపక్షంతో మాట్లాడి బెబుతామన్నారు.

User Comments