తేజ్ తీయ‌ని మోసం

Last Updated on by

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం -తేజ్‌. `ఐ ల‌వ్ యు` అనేది ఉప‌శీర్షిక‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. తొలి ప్రేమ ఫేం క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. జూలై 6న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.

ఇటీవ‌లే తేజ్ ట్రైల‌ర్ రిలీజైంది. ఇప్ప‌టికి యూట్యూబ్‌లో 20ల‌క్ష‌ల వ్యూస్‌ని ద‌క్కించుకుంది ఈ ట్రైల‌ర్‌. ముఖ్యంగా ట్రైల‌ర్ ఆద్యంతం సాయిధ‌ర‌మ్ ల‌వ్‌లీ పెర్ఫామెన్స్‌, అనుప‌మ క్యూట్ లుక్స్ ఆక‌ట్టుకున్నాయి. పోలీస్ క‌మీష‌న‌ర్ కూతురిని ప్రేమించే గ‌డుగ్గాయ్ పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ న‌టించార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఇక‌పోతే తేజ్‌ని అల్ల‌రిపెట్టే కిల్లాడి కాలేజ్ అమ్మాయిగా అనుప‌మ అంతే ఆక‌ట్టుకుంటోంది. సాయిధ‌ర‌మ్ – అనుప‌మ జంట అప్పియ‌రెన్స్ .. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి తేజ్ ట్రైల‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. అలానే సినిమా కూడా క‌రుణాక‌ర‌న్ శైలిలో ఆక‌ట్టుకుంటుంద‌నే అంతా అంచ‌నా వేస్తున్నారు. తేజ్‌, క‌రుణాక‌ర‌న్‌ల‌కు ఇది ఎంతో కీల‌క‌మైన సినిమా. మ‌స్ట్‌గా హిట్ కొడ‌తారేమో చూడాలి.

User Comments