కాస్టింగ్ కౌచ్ పై కేసీఆర్ క‌మిటీ

టాలీవుడ్ ఇండ‌స్ర్టీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం అప్ప‌ట్లో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. య‌ధేశ్చ‌గా లైంగింగ వేధింపులున్నాయంటూ వ‌ర్ధ‌మాన న‌టి శ్రీరెడ్డి ఆరోపించ‌డం, ఆధారాల‌తో స‌హా కొన్నింటిని బ‌య‌ట పెట్ట‌డంతో ఇండ‌స్ర్టీ పెద్ద‌లు దీన్ని సీరియ‌స్ గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా లైంగిక వేధింపుల‌పై తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేస్తూ జీవో విడుద‌ల చేసింది. దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.

త‌న పోరాటం ఫ‌లించింద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. నా క‌ల‌సాకార‌మైంది. కేసీఆర్ గారి చొర‌వ‌తో నేనిప్పుడు హీరోయిన్ అయ్యాను. ఏడాధిగా నేను అనుభ‌వించిన బాధ‌కు నేడు ఫ‌లితం ద‌క్కింది. ఆ రోజు నేను చేసిన అర్ధ‌న గ‌న్న ప్ర‌ద‌ర్శ‌న‌కు ఫ‌లిత‌మే ఇది అని పేర్కొంది. అయితే శ్రీరెడ్డి చేసిన ఉద్య‌మం వ‌ర‌క‌రూ బాగానే ఉంది. త‌ర్వాత ఆమె వైఖ‌రి మార‌డంతో బ‌య‌ట ఎలా ఫోక‌స్ అయిందో తెలిసిందే. ఫేస్ బుక్, ట్విట‌ర్ వంటి మాధ్య మాల్లో ఆమెకు సంబంధించిన కొన్ని హ‌ద్దులు మీరిన ఫోటోలు స్వ‌యంగా ఆమె పోస్ట్ చేసి అబాసుపాలైంది. అటుపై ప‌వ‌న్ ను దూషించ‌డంతో శ్రీరెడ్డి ప్ర‌చారం కోస‌మే ఇంత‌కు తెగ‌బ‌డింద‌ని ప్ర‌పంచ‌మే మాట్లాడుకోవ‌డం వంత్తైంది.