హాట్ న్యూస్.. దిల్ రాజు రాజకీయాల్లోకి..?

 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును మిగిలిన బడా ప్రొడ్యూసర్లతో పోల్చినా సరే.. రాజు గారికే ఎక్కువ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న విషయం తెలుస్తోంది. అంటే, అటు సక్సెస్ ను అందుకుంటూనే ఇటు జనాల దృష్టిలో కూడా ఎక్కువగా దిల్ రాజు కనిపిస్తూ ఉంటారు. అందుకే హీరోలు, డైరెక్టర్స్ తో పాటు తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్న నిర్మాతగా మంచి పేరు ఉంది దిల్ రాజుకి. అలాంటి దిల్ రాజుకు రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చిందని ఇప్పుడు ఉన్నట్టుండి న్యూస్ స్ప్రెడ్ అవడం హాట్ డిస్కషన్ కు దారితీస్తుంది.
అందులోనూ దిల్ రాజు రాజకీయ రంగప్రవేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగా జరుగుతుందని ప్రచారం జరుగుతుండటం హాట్ న్యూస్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే, రీసెంట్ గా ఫిదా సినిమాతో నిర్మాతగా దిల్ రాజు మరో సూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని టచ్ చేస్తూ తెరకెక్కిన ఈ ఫిదా సినిమాకు మొన్నామధ్య కేసీఆర్ కూడా ఫిదా అయిపోయారని చెప్పుకున్నాం. మామూలుగా పెద్దగా సినిమాలు చూడని కేసీఆర్ ఈ ఫిదా సినిమాను చూసి ఫిదా అయిపోయి దర్శక నిర్మాతలను అభినందించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అదిగో ఆ టైమ్ లోనే మన కేసీఆర్ ఊహించని విధంగా దిల్ రాజుకు ఓ ఆఫర్ ఇచ్చారని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అదేంటంటే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజుకు సామాజిక వర్గంతో పాటు సొంత ప్రాంతాల్లో మంచి పట్టు, పేరు ఉన్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో లోక్ సభ స్థానం టికెట్ ను ఇస్తానని కేసీఆర్ చెప్పారట. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ టికెట్ గాని, జహీరాబాద్ టికెట్ గాని ఇస్తానని అన్నారట. దీంతో ఆ మాటకు దిల్ రాజు కూడా పాజిటివ్ గా స్పందించారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మరోవైపు, నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహరిస్తుండటంతో.. దీనిపై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో కవిత అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం బయటకొచ్చింది. మరి ఈ మొత్తం స్టోరీ అంతా నిజమో కాదో తెలియాలంటే.. 2019 ఎలక్షన్ టైమ్ వరకు వెయిట్ చేయాలేమో.