టీ-గ‌వ‌ర్న‌ర్ కోసం సైరా ప్రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న విడుద‌లై భారీ స‌క్సెస్ వైపుగా  దూసుకుపోతుంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన‌ట్లు ట్రేడ్ లెక్క‌లు చెబుతున్నాయి. అటు మెగా అభిమానులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆ సంతోషాన్ని చిరంజీవి థాంక్స్ మీట్ లో అంద‌రితో పంచుకున్నారు.

తాజాగా చిరంజీవి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా గ‌వ‌ర్న‌ర్‌కు చిరంజీవి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం తాను నటించిన సైరా సినిమా చూడాలని గవర్నర్‌ను కోరారు. అందుకు గ‌వ‌ర్న‌ర్ కూడా స‌ముఖ‌త వ్య‌క్తం చేసారు. తాను సైరా సినిమా చూడాలనుకుంటున్నట్టు గవర్నర్‌ తెలిపారు. ఇటీవ‌లే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంకా చిరంజీవి రాజ‌కీయ స‌న్నిహితులు, స్నేహితులు సైరా సినిమా చూసి ఆయ‌న్ని అభినందించిన సంగ‌తి తెలిసిందే. తేదేపా యువ‌నాయ‌కుడు నారా లోకేష్ ఈ సినిమా వీక్షించి మెగాస్టార్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.