చిరంజీవి ఫ్యాన్స్ కు మంత్రి కేటీఆర్ గిఫ్ట్

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుని.. ఫ్యాన్స్ కు త‌న న‌ట‌న‌తో క‌రెంట్ పుట్టించ‌గ‌ల మ‌గ‌ధీరుడు ఈ మెగావీరుడు. 63 ఏళ్ల వ‌య‌సులోనూ కుర్రాడిలా సైరా కోసం క‌ష్ట‌ప‌డుతున్న చిరంజీవిని చూసి నిజంగా క‌ష్ట‌జీవి అనే వాళ్లు లేక‌పోలేదు. ఇంత క‌ష్ట‌ప‌డే హీరోను అభిమానులు మాత్రం ఎందుకు దూరం చేసుకుంటారు..? అందుకే రాజ‌కీయాల్లో వెళ్లి ఇమేజ్ పాడు చేసుకున్నా.. ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తే రా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా ఖైదీ నెం.150తో అక్కున చేర్చుకున్నారు మెగాస్టార్ ను. ఇదంతా మ‌న తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి. ఇక ఇండియాలోనూ చిరంజీవికి చాలా క్రేజ్ ఉంది. కానీ ప‌క్క దేశాల్లో ఇంత గుర్తింపు ఉంటుందా లేదా అనే డౌట్స్ అంద‌ర్లోనూ ఉంటాయి. దానికి స‌మాధానం ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చారు.

Telangana Misister KTR Gift to Megastar Chiranjeevi Fans

ఈయ‌న ప్ర‌స్తుతం జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి షిజోకా రాష్ట్రంలోని హమమత్సు అనే నగరంలో ఉన్న సుజుకి మ్యూజియంకు వెళ్లాడు కేటీఆర్. అక్క‌డి మ్యూజియంలో చిరంజీవి ఫోటో ఉండ‌టంతో బాగా ఆనంద‌ప‌డ్డాడు కేటీఆర్. రాజ‌కీయ ప‌రంగా ఉన్న రిలేష‌న్స్ ప‌క్క‌న‌బెట్టి ఆ ఆనందాన్ని తానొక్క‌డే అనుభ‌వించ‌డం కాదు మెగా అభిమానుల‌కు.. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ అందించాడు కేటీఆర్. ఎక్క‌డో జ‌పాన్ లోని చిన్న నగరంలోని మ్యూజియంలో మ‌న చిరంజీవి గారి ఫోటో ఉంది.. చాలా ఆనందంగా ఉంది.. మ‌న తెలుగు వాడి బొమ్మ ఇక్క‌డున్నందుకు అంటూ త‌న ఫ్యాన్ మూవెంట్ ను కెమెరాలో బంధించాడు కేటీఆర్. అన్న‌ట్లు జ‌పాన్ అంటే వెంట‌నే గుర్తొచ్చేది ర‌జినీకాంత్ పేరే. అక్క‌డ ఈయ‌న‌తో పాటు మెగాస్టార్ కూడా ఫేమ‌స్సే అని ఇప్పుడు తెలంగాణ మంత్రి పుణ్య‌మా అని తెలిసింది.

User Comments