మున్సిప‌ల్ ఎన్నికలపై నేడే క్లారిటీ

ఆగస్టు రెండోవారం నాటికే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, ఆగస్టు 15 నుంచి అసలైన పాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ, వార్డుల విభజన, ఇతర అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లు ఎన్నికలపై సందిగ్ధతను పెంచాయి. ఏడు మునిసిపాలిటీల ఎన్నికలపై హైకోర్టు ఇప్పటికే స్టే విధించింది. పదుల సంఖ్యలో పిటిషన్‌లు ఇంకా విచారణలోనే ఉన్నాయి. కాగా మునిసిపల్‌ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది.