టెలిగ్రామ్‌ని బ్యాన్ చేయాలి

టెలిగ్రాం యాప్ ను నిషేధించాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా నిల‌వ‌డంతోనే ఈయాప్ ని బ్యాన్ చేయాల‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే నిషేధించారు. ఇండియాలో కూడా ప‌లు టెలికాం ఆప‌రేట‌ర్లు ఇప్ప‌టికే టెలిగ్రాం వెబ్ వెర్ష‌న్ ని బ్యాన్ చేసాయి. కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌లేదు. టెలిగ్రాం ను స‌మూలంగా నిషేధించాల‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా హీరో నిఖిల్ కూడా ఈ డిమాండ్ ను తెర మీద‌కు తీసుకొచ్చాడు.

దీని బ్యాన్ పై ప్ర‌భుత్వం వెంట‌నే దృష్టి పెట్టాలి. సినిమా పైర‌సీకి, ఉగ్ర‌వాద, అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు టెలిగ్రాం అడ్డాగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు. నిఖిల్ ని  ట్విట‌ర్ లో ఓ నెటిజ‌నుడు ప్ర‌శ్నించ‌గా వ‌చ్చిన స‌మాధానం అది. దీనికి హైద‌ర‌బాద్ పోలీసులు కూడా స్పందించారు. అయితే నిఖిల్ స్పంద‌న పై కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఆ యంగ్ హీరో న‌టించిన అర్జున్ సుర‌వ‌రం సినిమా పైర‌సీ అయిన నేప‌థ్యంలో ప్ర‌చారం కోసం టెలిగ్రామ్ అంటూ మీడియా అటెన్ష‌న్ ని డ్రా చేయ‌డం కోసం ఇలాంటి ప్ర‌య‌త్నం చేసాడ‌ని అంటున్నారు. స‌మాజంలో జ‌రుగుతోన్న చెడు గురించి ఇన్నాళ్లు నిఖిల్ కి తెలియ‌దా? ఎవ‌రో ఒక‌రు క్వ‌శ్చ‌న్ చేస్తే గానీ! మాట్లాడే స‌మ‌స్య‌పై  మాట్లాడే  రెస్పాన్సిబిలిటీ లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  సినిమా న‌టులు కొంద‌రు తెలివిగా  ప‌బ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారంటే కామెంట్లు ప‌డుతున్నాయి. మ‌రి ఈ కామెంట్ల‌కు నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.