బాల ద‌ర్శ‌క‌త్వంలో తెలుగమ్మాయి

నేష‌న‌ల్ అవార్డు ద‌ర్శ‌కుడు బాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం ప్ర‌తీ హీరో, హీరోయిన్ కి ఓ డ్రీమ్. ఛాన్స్ వ‌స్తే క‌థ కూడా విన‌కుండా సంత‌కం చేసేంత న‌మ్మ‌కం బాల అంటే. కొన్నేళ్ల‌గా స‌రైన స‌క్సెస్ లు లేక ఇబ్బంది ప‌డుతోన్న బాల‌కు ఇటీవ‌ల అర్జున్ రెడ్డి రీమేక్ తో విమ‌ర్శ‌లు ఎదుర్కోన్న సంగ‌తి తెలిసిందే. అయినా బాల‌పై ఆ ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌లేదు. అర్జున్ రెడ్డి క‌న్నా గొప్ప సినిమా చేసి స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. దీనిలో భాగంగా ఇద్ద‌రు, ముగ్గురు కోలీవుడ్ స్టార్ హీరోల‌ను బాల లైన్ లో పెట్టారు. ఆర్య‌, అధ‌ర్వ‌ల‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అధ‌ర్వ తో `ప‌ర‌దేశి` తెర‌కెక్కించి అవార్డులు కొల్ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో అధ‌ర్వ ఓ వైవిథ్య‌మైన పాత్ర‌లో క‌నిపించనున్నాడుట‌. ఈ న‌యా మ‌ల్టీస్టార‌ర్ లో తెలుగు హీరోయిన్ బిందు మాధ‌వికి అవ‌కాశం ద‌క్కింది. కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ సినిమ‌ల్లో న‌టించిన అమ్మ‌డు ఇప్పుడు కోలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో స్టార్ హీరో, ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసే అవ‌కాశం ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బాల ఛాన్స్ బిందుమాధ‌వికి ట‌ర్నింగ్ అని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం బిందు మాధ‌వి రెండు కోలీవుడ్ సినిమాలు చేస్తోంది. అందులో ఒక‌టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, మ‌రొక‌టి షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.

Also Read : Arjun Suravaram Postponed Again