ఇండ‌స్ట్రీలో ప‌డుకుంటే కానీ ప‌న‌వ్వ‌దా..?

శ్రీ‌రెడ్డి.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో త‌ప్ప బ‌య‌టి వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌ని పేరు ఇది. ఈ పేరుతో ఓ యాంక‌ర్ మాత్రమే ఉంద‌ని తెలుసు.. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నోళ్ల‌కు మాత్రం త‌న అందంతో షాక్ ఇస్తూ ఉంటుంది శ్రీ‌రెడ్డి. కానీ ఇప్పుడు ఒక్క‌రోజులో ఈ భామ సూప‌ర్ పాపులర్ అయిపోయింది. తెలుగు అమ్మాయిల కోసం ఉద్ద‌రించే నాయ‌కురాలు అయిపోయింది. ఇండ‌స్ట్రీలో ప‌డుకుంటే త‌ప్ప ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేద‌ని చెప్పి.. హీరోల‌ను బ్రోక‌ర్స్ అని.. ద‌ర్శ‌కుల‌ను వెధ‌వ‌లు అని.. నిర్మాత‌ల‌కు పోరంబోకులు అని.. ఇలా ఎన్నెన్ని అనాలో అన్నీ అనేసి ఓ సంచ‌ల‌నం సృష్టించించి శ్రీ‌రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా నేరుగానే ఈ భామ అడిగి క‌డిగేసింది. తెలుగ‌మ్మాయిల‌ను ఇండ‌స్ట్రీలో ఎందుకు ప‌ట్టించుకోరు.. ఇక్క‌డ అందంగా లేరా.. లేదంటే ప‌డుకోవ‌ట్లేదా.. అన్నీ చేస్తున్నారు క‌దా అయినా కానీ ఎందుకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదంటూ ఫైర్ అయింది శ్రీ‌రెడ్డి. ఈ భామ మాట‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.Telugu Heroines Talking About Casting Couch for Movie Chancesఇండ‌స్ట్రీ ఏదైనా ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి చ‌ర్చ‌లు బాగా న‌డుస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అంటే అవ‌కాశాల కోసం ప‌డుకోవ‌డం అని అర్థం. అది ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ ఉంటుంది.. కాక‌పోతే సినిమా ఇండ‌స్ట్రీ ఎప్పుడూ ఫోక‌స్ లోనే ఉంటుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో ఈ విష‌యం గురించి చాలా మంది ముద్దుగుమ్మ‌లు మాట్లాడారు. అంతెందుకు తాజాగా ఇలియానా సైతం ఈ విషయంపై నోరు విప్పింది. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు క‌మిట్మెంట్ అడుగుతారంటూ సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు శ్రీ‌రెడ్డి కూడా ఇదే చేసింది. తెలుగు ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ప‌డుకోవాల్సిందే అని నేరుగానే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ‌. అమ్మాయిల‌ను వాడుకుని కూడా పెద్ద క్యారెక్ట‌ర్స్ ఇవ్వ‌రు అంటూ సంచ‌ల‌నం సృష్టించింది. గ‌తంలో ఈ ఇష్యూ గురించి చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఇది ఎక్కువ కాక రేపుతుంది. ఇండ‌స్ట్రీలో ఖచ్చితంగా ప‌డుకోక‌పోతే ప‌ని జ‌ర‌గ‌దు అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.Telugu Heroines Talking About Casting Couch for Movie Chancesఆ మ‌ధ్య ఈ విష‌యంపై ప్ర‌ణీత కూడా నోరు విప్పింది. తెలుగులో అత్తారింటికి దారేది, ర‌భ‌స‌ లాంటి సినిమాల్లో న‌టించింది ప్ర‌ణీత‌. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రీలో మేల్ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంద‌నేది మాత్రం నిజం.. త‌న తొలి సినిమా అప్పుడు రూమ్‌లోకి పరిగెత్తుకొని వెళ్లే షాట్‌ ఉంది. కెమేరా యాంగిల్ నా కంట్రోల్‌లో లేదు. సీన్‌ను స్లో మోషన్‌లో తీశారు. అది చాలా అస‌హ్యంగా ఉంటుంది.. అది చూసి నాకే సిగ్గుగా అనిపించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్కీగా నాకు ఏ రోజు కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ వంటి బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ లేదు. కానీ హీరోయిన్స్‌ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబితే ఖచ్చితంగా విమర్శలకు గురవుతారు. పార్వతి న‌య్య‌ర్ కానీ.. మ‌రే హీరోయిన్ కానీ త‌మ చేదు అనుభ‌వాల గురించి చెప్పినా విమ‌ర్శిస్తున్నారు.Telugu Heroines Talking About Casting Couch for Movie Chancesఇదెక్క‌డి న్యాయం.. ఆ మ‌ధ్య ఓ సూపర్‌ స్టార్‌ సినిమా పోస్టర్‌ని పేరు చెప్పకుండా ఒక హీరోయిన్‌ విమర్శిస్తే.. ఆమెను హీరో ఫ్యాన్స్ కొట్టినంత ప‌ని చేసారు. వాళ్ల‌కు హీరోయిన్లు అంటే కేవ‌లం అందంగా క‌నిపిస్తే చాలు.. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌కి చెందిన మేల్‌ ఆడియన్స్‌ హీరోయిన్లను గ్లామరస్‌గా చూడ్డానికి ఇష్టపడతారనుకుంటా. వాళ్లకు ఏం కావాలో అదే మేం చేస్తున్నాం అని చెప్పింది ప్ర‌ణీత‌. ఇక ఇదే విష‌యంపై క‌న్న‌డ భామ శృతిహ‌రిహ‌ర‌న్ కూడా మాట్లాడింది. ఈ భామకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది. ఈ విష‌యాల‌పై మాట్లాడుతూ.. సినిమాలో హీరోకి డాక్టర్, ఇంజనీర్, జర్నలిస్ట్‌ అని ఏదో ఒక ప్రొఫెషన్‌ ఉంటుంది. హీరోయిన్స్‌కు ఒక క్యారెక్టరైజేషన్‌ ఉండదు. కేవలం వారి అందాలను చూపించటానికే ఉపయోగపడతున్నారు. వారి శరీరం మీద సినిమా వ్యాపారం జరగడం విచారకరం. రాధికాఆప్టే, శ్రీ‌య లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఆ మ‌ధ్య ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. అలా ఇండ‌స్ట్రీలో ప‌డుకుంటే గానీ ప‌ని జ‌ర‌గ‌దంటున్నారు హీరోయిన్లు.