తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ మూవీ రివ్యూ

Tenali Ramakrishna BA BL

నటీనటులు : స‌ందీప్ కిష‌న్, హ‌న్సిక‌ త‌దిత‌రులు..
బ్యానర్: ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్
స‌మ‌ర్ప‌ణ‌: జ‌వ్వాజి రామాంజ‌నేయులు
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి- సంజీవ్ రెడ్డి- రూపా జ‌గ‌దీష్
సంగీతం: సాయికార్తీక్
రచన- దర్శకత్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి

ముందు మాట:
వరుస ప‌రాజ‌యాల త‌ర్వాత `నిను వీడ‌ని నీడ‌ను నేను` చిత్రంతో యంగ్ హీరో సందీప్ కి కొంత రిలీఫ్ ద‌క్కింది. ఆ సినిమా ఫ‌ర్వాలేద‌నిపించింది. తాజాగా అత‌డు న‌టించిన చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌`. `కేసులు ఇవ్వండి ప్లీజ్‌` అనేది ట్యాగ్ లైన్‌. కామెడీ చిత్రాల స్పెష‌లిస్ట్ మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. హీరో సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. హ‌న్సిక క‌థానాయిక కాగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. నేడు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. సందీప్ ఆశించిన ఆ ఒక్క బంప‌ర్ హిట్టు త‌గిలిందా లేదా? అస‌లు ఆడియెన్ ని మెప్పించేంత మ్యాట‌ర్ సినిమాలో ఉందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
కేసుల్లేని చెట్టుకింద ప్లీడ‌ర్ త‌ర‌హా తెనాలి రామ‌కృష్ణ (సందీప్ కిష‌న్). పార్టీల్ని పిలిచి రాజీకి కుదిర్చి లాంగ్ పెండింగ్ కేసుల్ని డీల్ చేస్తూ సంపాదిస్తుంటాడు. అత‌డికి వ‌ర‌ల‌క్ష్మి (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్) రూపంలో స‌రైన కేస్ తగుల్తుంది. ఆ త‌ర్వాత తెనాలి రామ‌కృష్ణ జీవితం ఎలా మారింది? వ‌ర‌ల‌క్ష్మి వెన‌క ఉన్న హారిబుల్ మ‌ర్డ‌ర్ కేసు అత‌డిని ఎలాంటి చిక్కుల్లో ప‌డేసింది?.. చివ‌రికి ఆ కేసును గెలిచాడా లేదా? కేస్ డీల్ చేసేప్పుడు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు? అన్న‌దే ఈ సినిమా.

ఒక సాధా సీదా ఫ‌స్టాఫ్.. అందులో అక్క‌డ‌క్క‌డా వ‌ర్క‌వుట‌య్యే కామెడీ సీన్లు.. ఇక సెకండాఫ్ లో చేజారిన గ్రిప్పింగ్ నేరేష‌న్ తో ఈ సినిమా నేరేష‌న్ తేలిపోయింది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బావున్నా..సెకండాఫ్ లో కీల‌కమైన మ‌లుపు టేకాఫ్ చేయ‌గ‌లిగినా.. కానీ రెండో భాగంలో ఎక్కువ‌గా సిల్లీ సీన్ల‌తో చుట్టేయ‌డం రొటీన్ స్టోరీ వ‌ల్లా మిస్ ఫైర్ అయ్యింది. ఓల్డ్ స్టైల్ నేరేష‌న్.. రొటీన్ కాప్ కామెడీ.. చెప్పుకోద‌గ్గంత లేని క్లైమాక్స్ .. ఈ త‌ప్పుల‌న్నీ క‌ల‌గ‌లిసి తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ ని బిలో యావ‌రేజ్ సినిమాగా నిలిపాయి.

న‌టీన‌టులు:
సందీప్ కి బాగా న‌వ్వించేందుకు ఆస్కారం ఉన్న‌ టైల‌ర్ మేడ్ రోల్ లో అలా అలా న‌టించేశాడు. అత‌డు మ‌రింత ఎఫ‌ర్ట్ పెట్టాల్సింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ హ‌న్సిక తెలుగులో చెప్పుకోద‌గ్గ పాత్ర‌లోనే న‌టించి ఫ‌ర్వాలేద‌నిపించింది. వ‌ర‌ల‌క్ష్మి త‌న‌కు ద‌క్కిన కీల‌క పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. అయితే త‌న పాత్ర‌ను సెకండాఫ్ లో తీర్చిదిద్దిన విధానం అస్స‌లు బాలేదు. ముర‌ళి శ‌ర్మ‌, ర‌గుబాబు, కిన్నెర వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్, స‌త్య కృష్ణ‌న్, చమ్మ‌క్ చంద్ర అక్క‌డ‌క్క‌డా న‌వ్వించ‌గ‌లిగారు. స‌ప్త‌గిరి, ప్ర‌భాస్ శ్రీ‌ను వెరీ గుడ్.

టెక్నీషియ‌న్స్:
నాగేశ్వ‌ర్ రెడ్డి మ‌రో రొటీన్ స్టోరీనే ఎంచుకున్నాడు. అత‌డి గ‌త చిత్రాల‌న్నీ కామెడీపైనే ర‌న్ అవుతాయి. కానీ ఈ చిత్రంలో అది కూడా స‌రిగా లేదు. కొన్ని సీన్లు, బ్లాకుల్లో మాత్ర‌మే కామెడీ పండ‌గా చాలా చోట్ల తేలిపోయింది. కామెడీ జ‌స్ట్ యావ‌రేజ్ అని అనిపించింది. జ‌గ‌న్ కోడి క‌త్తి ఎపిసోడ్, కేఏ పాల్ రిఫ‌రెన్స్, గ్రామ వ‌లంటీర్లు వ‌గైరా ఫ‌న్నీ సీన్స్ వ‌ర్క‌వుట‌య్యాయి. ఇక సాయి కార్తీక్ పాట‌లు రొటీన్. ఆర్.ఆర్ సాధా సీదాగానే చేశాడు. సాయి శ్రీ‌రామ్ కెమెరా గుడ్. చోటా.కె.ప్ర‌సాద్ ఎడిటింగ్ కి మ‌రింత బెట‌ర్ మెంట్ కి ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్:

* కొన్ని కామెడీ సీన్లు
* ఇంట‌ర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:

* రొటీన్ స్టోరి.. పాత‌బ‌డిన కామెడీ
* సెకండాఫ్ మిస్ ఫైర్

ముగింపు:
తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్: ఇదే చిట్ట‌చివ‌రి కేసు

రేటింగ్:
2.5/5