అల్లు వారి టెన్ష‌న్ అటెన్ష‌న్‌

Last Updated on by

మంది జ‌నం ఓవైపు. బ‌న్ని ఒక్క‌డే ఇంకో వైపు. `గంగోత్రి` సినిమాతో అత‌డు ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు వినిపించిన కామెంట్ల‌ను ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. క‌ట్ చేస్తే ఇప్పుడు 100-150 కోట్ల క్ల‌బ్ హీరో. ఒక్క అడుగుతో మొద‌లై, కేవ‌లం ఐదు- ప‌దేళ్ల‌లోనే బ‌న్ని సాధించిన అసాధార‌ణ ఫీట్ ఇది. అటు బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ అంత‌టివాడు ద‌శాబ్ధాల కెరీర్ అనుభ‌వంలో చేయ‌గ‌లిగిన దానిని అల్లు అర్జున్ అనే మెగా హీరో, ప్రాంతీయ భాషా హీరో చేయ‌గ‌లిగాడు అన్న‌ది చెప్పుకున్నంత వీజీ కాదు. ఆ వెన‌క క‌ఠోర‌శ్ర‌మ‌, అకుంఠిత ధీక్ష దాగి ఉంది. స‌వాళ్లు- ప్ర‌తిస‌వాళ్ల‌ను ఎదుర్కొని మొక్క‌వోని ధీక్ష‌తో ప్ర‌ణాళిక బ‌ద్ధంగా చేసిన కృషి ఎంతో ఉంది. మెగాభిమానుల అండాదండ ఉన్నా.. బాస్ అర‌వింద్ ఎంత పాకులాడినా నిల‌బెట్టే ప్ర‌తిభ ఉండాలి క‌దా!? అది బ‌న్ని వ‌ల్ల సాధ్య‌మైంది. అందుకే అత‌డు మెగా హీరోల్లోనే రియ‌ల్ ఛాలెంజ‌ర్‌గా ఎద‌గ‌డానికి కార‌ణ‌మైంది. టాలీవుడ్‌, మాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా అభిమానజ‌నం నీరాజ‌నాలు అందుకుంటున్న బ‌న్ని .. నెక్ట్స్ ప్లాన్ ఏంటి? అంటే అందుకు స‌రైన స‌మాధానం రెడీగా ఉంది.

స్టార్‌డ‌మ్ అనేది ఏ కొద్ది ప‌రిశ్ర‌మ‌ల‌కో అంకిత‌మైతే క‌ష్టం. ఇప్పుడున్న ఠ‌ప్ కాంపిటీష‌న్‌లో అన్ని భాష‌ల్లోనూ స‌త్తా చాటాలి. `బాహుబ‌లి` ప్ర‌భాస్‌, `రంగ‌స్థ‌లం` రామ్‌చ‌ర‌ణ్ త‌మ‌ ముందుంచిన రికార్డుల స‌వాల్‌ని ఎదుర్కోవాలి. అందుకే బ‌న్ని తొలి నుంచి తెలివైన ప్ర‌ణాళిక‌తో ముంద‌డుగేశాడు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ క‌థాంశాన్ని ఎంచుకుని యూనివ‌ర్శ‌ల్ అప్పీల్‌తో ముందుకొస్తున్నాడు. `నా పేరు సూర్య‌`(ఎన్‌పీఎస్‌)తో ఇండియా లెవ‌ల్ మార్కెట్‌ని గుప్పిట ప‌ట్టేందుకు ప్ర‌ణాళిక ర‌చించాడు. ఇప్పుడు అందుకు స‌మ‌యమాస‌న్న‌మైంది. మే 4 రిలీజ్ కాబ‌ట్టి, ఈలోగానే ఉత్కంఠ పెంచే ఏదో ఒక ప‌ని చేయాలి. అదే 11ఏఎం థియేట్రిక‌ల్ లాంచ్‌. ఈ ట్రైల‌ర్‌పై అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. బ‌న్నిలో అయితే ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్‌. అల్లు కాంపౌండ్ మొత్తం ఈ ట్రైల‌ర్‌తో వ‌ర‌ల్డ్ ఫ్యాన్స్ వ్యూస్‌ని ట‌చ్ చేయ‌నున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ లో ఎగ్జ‌యిట్‌మెంట్ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. స‌రిగ్గా ఇలాంటి వేళ ఇటీవ‌లి వివాదాల నేప‌థ్యంలో ప‌లు తెలుగు టీవీ చానెళ్లు అల్లు కాంపౌండ్ పై గుర్రుమీదున్నాయి. చానెళ్ల తీరుపై మండి ప‌డిన బ‌న్ని, చానెళ్ల దిగ్భంద‌నం అంశాన్ని తెర‌పైకి తెచ్చిన అర‌వింద్‌పై పీక‌ల‌దాకా కోపంలో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఎన్‌పీఎస్‌కి కావాల్సిన ప్ర‌మోష‌న్ ద‌క్కుతుందా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. ఎన్‌పీఎస్‌పై ఆ ప్ర‌భావం ఎంత‌? అంటూ వేడెక్కే చ‌ర్చ సాగుతోంది. 11 ఏఎం ట్రైల‌ర్‌ దానికి స‌మాధానం.. అందుకే అల్లు వారిలో టెన్ష‌న్ టెన్ష‌న్‌..

User Comments