వావ్… చిరు పోస్టర్ మ్యూజిక్ తమన్దంట

కొద్దిసేప‌టి కిందే చిరంజీవి 151వ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరుతో ఆ సినిమాని తెర‌కెక్కిస్తార‌ని ఊహించినా.. అంద‌రి ఊహ‌ల్ని త‌ల‌కిందులు చేస్తూ `సైరా న‌ర‌సింహారెడ్డి` పేరును ఖ‌రారు చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటే పేరుని ఆవిష్క‌రించారు. పౌరుషం ఉట్టిప‌డే పేరు ఒకెత్తైతే, మోష‌న్ పోస్ట‌ర్ మ‌రో ఎత్తు. సినిమా స్ఠాయిని తెలియ‌జేసేలా ఉంది పోస్ట‌ర్‌. దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మ‌రింతగా అదిరిపోయింది.

క్యాస్ట్ అండ్ క్రూ టీజ‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎ.ఆర్‌.రెహ‌మాన్ పేరుంది. దాంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎ.ఆర్‌.రెహ్మాన్‌దే ఉంటుందేమో అనుకొన్నారంతా. కానీ షాకింగ్ విష‌య‌మేంటంటే ఆ స్కోర్ త‌మ‌న్‌దట‌. సురేంద‌ర్‌రెడ్డి, త‌మ‌న్‌ల మ‌ద్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్ కొద్దీ మోష‌న్ పోస్ట‌ర్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేసే అవ‌కాశం త‌మ‌న్‌కి ఇచ్చాడు సూరి. ఆ అవ‌కాశాన్ని చ‌క్క‌గా వినియోగించుకొన్నాడు త‌మ‌న్‌. ఆయ‌న పోస్ట‌ర్‌కే ఈ రేంజి మ్యూజిక్ ఇస్తే ఇక సినిమాకి రెహ్మాన్ ఏ రేంజిలో దంచికొడ‌తాడో ఊహించుకోవ‌చ్చు.

Here is the Sye Raa Motion Poster….

 

Follow US