బ‌న్నీ-త్రివిక్రమ్ కి త‌మ‌న్ సంగీతం

Thaman blockbuster music for allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే మ్యూజిక్ ప‌రంగా త్రివిక్ర‌మ్ గ‌త ప‌రాజ‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఏ సంగీత ద‌ర్శ‌కుడిని ఎంపిక చేయాల‌న్న అంశంపై సందిగ్ధంలో ప‌డ్డాడు. ముఖ్యంగా బ‌న్నీతో అజ్ఞాతవాసి త‌ర‌హాలో ఏదైనా సాహసం చేస్తాడేమోన‌న్న రూమ‌ర్ వినిపించింది. ఈ నేప‌థ్యంలో అనిరుద్ స‌హా ప‌లువురు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ రియ‌లైజ్ అయ‌న మాంత్రికుడు చివ‌రికి త‌మ‌న్ ఎంపిక చేసిన‌ట్లు ఖార‌రైంది.

ఈ విష‌యాన్ని త‌మ‌న్, చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. త్రివిక్రమ్ గ‌త సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌కు బాణీలు స‌మ‌కూర్చింది త‌మ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మ్యూజిక‌ల్ గాను మంచి విజ‌యం సాధించింది. అందుకే మ‌రోసారి ఆ బాధ్య‌త‌లు త‌మ‌న్ కి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్, బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌లిసి ఉన్న ఓ ఫోటోల‌ను త‌మ‌న్ ట్విట‌ర్లో పోస్ట్ చేసాడు.

Also Read: Release Confusion For Allu Arjun’s Next