దేవీశ్రీ రీప్లేస్‌మెంట్‌!

Last Updated on by

విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ చైత‌న్య రేర్ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళుతున్న సంగ‌తి తెలిసిందే. `వెంకీ మామ‌` అనేది వ‌ర్కింగ్ టైటిల్. కోన వెంక‌ట్ స్క్రిప్టు అందించి స్వ‌యంగా కోన కార్పొరేష‌న్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ పిలింఫ్యాక్ట‌రీతో క‌లిసి కోన చేస్తున్న ప్ర‌య‌త్నమిది. జైల‌వ‌కుశ ఫేం బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ఇప్ప‌టికే కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆగ‌స్టు 8 నుంచి హైదార‌బాద్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. అయితే స‌రిగ్గా ప్రారంభానికి ముందు ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడిని రీప్లేస్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ స్థానంలో ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా రీప్లేస్ చేశార‌ని తెలుస్తోంది. అయితే ఎంతో క్రేజీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం నుంచి దేవీనే త‌నంత‌ట తానుగా త‌ప్పుకున్నాడా? లేక త‌ప్పించారా? అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది.

User Comments