త‌రుణ్ భాస్క‌ర్ రెండు సినిమాలు

Last Updated on by

యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ల‌ఘు చిత్రాల‌తో పాపుల‌రై అటుపై `పెళ్లి చూపులు` చిత్రంతో పెద్ద తెర క‌ల‌ల్ని నెర‌వేర్చుకున్న సంగ‌తి తెలిసిందే. తొలి ప్ర‌య‌త్న‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాని రాజ్ కందుకూరి నిర్మించి, డి.సురేష్‌బాబు స‌హాయంతో రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు ప్రాంతీయ కేటగిరీలో జాతీయ ఉత్త‌మ చిత్రంగా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్రేజుతో త‌రుణ్ భాస్క‌ర్‌కి పిలిచి మ‌రీ అవ‌కాశాలిచ్చారు సురేష్‌బాబు.

ఇదివ‌ర‌కూ `ఈ న‌గ‌రానికి ఏమైంది?` లాంటి విభిన్న‌మైన ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అది కేవ‌లం మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్ సినిమా .. నైజాం యాక్సెంట్ టూమ‌చ్ అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మొత్తానికి ఆ సినిమా ఫ‌లితం మాత్రం తారుమారైంది. అయినా త‌రుణ్‌లోని ప్ర‌తిభావంతుడిని న‌మ్మి డి.సురేష్‌బాబు అత‌డితో వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, క‌లిసి నిర్మించే సినిమా వేరొక‌టి సెట్స్ కి తీసుకెళ్లేందుకు ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. అలాగే త‌రుణ్ భాస్క‌ర్ తో వెబ్ సిరీస్‌ల‌ను సురేష్ బాబు బృందం ప్లాన్ చేస్తోంది.

User Comments