2020 సంక్రాంతి అంత‌కంత‌కు హీట్

మ‌హేష్ – స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్-అల వైకుంట‌పురములో, ర‌జ‌నీకాంత్ – ద‌ర్బార్, ఎన్‌బీకే 105 ఇవ‌న్నీ 2020 సంక్రాంతి బ‌రిలో ఫిక్స‌యిన సంగ‌తి తెలిసిందే. ఇన్ని భారీ సినిమాలొస్తున్నా న‌వ‌త‌రం హీరోల సినిమాలు సంక్రాంతి క్యూలో ఉండడం చూస్తుంటే ఈసారి పోటీ ఏ స్థాయిలో ఉండ‌నుందో అర్థ‌మ‌వుతోంది. సంక్రాంతి హీట్ అంత‌కంత‌కు పెరుగుతోంద‌నే దీన‌ర్థం.

క‌ళ్యాణ్ రామ్, స‌తీష్ వేగేష్ణ కాంబినేష‌న్ మూవీ ఎంత మంచివాడ‌వురా, శ‌ర్వానంద్ -కిషోర్ రెడ్డి మూవీ శ్రీ‌కారం, సాయిధ‌రమ్, మారుతి కాంబినేష‌న్ మూవీ `ప్ర‌తి రోజు పండ‌గే` సంక్రాంతి బ‌రిలోనే రిలీజ్ కానున్నాయ‌ని తెలుస్తోంది. వీటిలో కొన్నిటికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటే అక్కినేని హీరోలు .. ఇత‌ర చిన్న త‌ర‌హా హీరోల సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది.